|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Soniya AKula: ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!

Published: 18-07-2025, 12:51 PM

రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల తాజాగా గర్భవతి అని ప్రకటించింది. ఆమె ఈ శుభవార్తను ఆసక్తికరమైన విధంగా వెల్లడించింది.

Key Points

1

బిగ్ బాస్ సోనియా ఆకుల గర్భవతి అని ప్రకటించింది.

2

ఆమె తన భర్తకు ఈ శుభవార్తను 'ప్రాజెక్ట్' రూపంలో చెప్పింది.

4

అభిమానులు సోనియా-యశ్ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

బిగ్ బాస్ సోనియా గర్భవతి

తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్ ‌ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల . ఎనిమిదో సీజన్ ‌ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది . బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. ఆ తర్వాతే కొన్ని రోజులకే డిసెంబర్ ‌ లో యశ్‌వీర్‌ గ్రోనితో ఏడడుగులు వేసింది . నవంబర్ ‌ లో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ .. నెల రోజుల్లోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది .

ప్రాజెక్ట్ రూపంలో శుభవార్త

ఇటీవల తిరుమలను సందర్శించిన సోనియా.. తాజాగా అభిమానులకు అదిరిపోయే గుడ్ ‌ న్యూస్ చెప్పింది . తాను గర్భం ధరించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది . ఈ విషయాన్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసింది . ఓ ప్రాజెక్ట్ ‌ రూపంలో ఫైల్ పట్టుకుని మరి వచ్చి తన భర్త యశ్‌వీర్‌ గ్రోనికి ఈ విషయాన్ని తెలియజేసింది . ఈ శుభవార్త విన్న యశ్ ‌ వీర్ ‌ గ్రోని తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ‌ గా మారింది . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు .

సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.

బిగ్ బాస్ సోనియా ఆకుల గర్భవతి అనే శుభవార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ జంటకు అందరి నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.