|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ తెలుగు 9లోకి లక్స్ పాప ఎంట్రీ.. అతడిని ప్రేమించి ఎంత టార్చర్ అనుభవించిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Published: 07-09-2025, 11:46 AM
బిగ్ బాస్ తెలుగు 9లోకి లక్స్ పాప ఎంట్రీ.. అతడిని ప్రేమించి ఎంత టార్చర్ అనుభవించిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నటి ఫ్లోరా షైనీ (లక్ష్ పాప) ఎంట్రీ ఇచ్చింది. తన వృత్తి జీవితం, ప్రేమ విషయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె పంచుకుంది. ఆమె అనుభవాలు చాలా కష్టతరమైనవి.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9లో లక్ష్ పాప ఆశా షైనీ (ఫ్లోరా షైనీ) ఎంట్రీ.

2

ఆమె తన వృత్తి జీవితం, ప్రేమ విషయంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది.

4

46 ఏళ్ల ఫ్లోరా షైనీ నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

ఫ్లోరా షైనీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభం అయింది. ముందు నుంచి సీజన్ 9 కి ఒక రేంజ్ లో హైప్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే హౌస్ లో చాలా మార్పులు చేశారు. ఈసారి రెండు హౌస్ లో ఉండబోతున్నాయి. సెలెబ్రిటీలతో పాటు ఐదుగురు సామాన్యులు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెకండ్ కంటెస్టెంట్ గా నరసింహ నాయుడు లక్స్ పాప ఆశా షైనీ( ఫ్లోరా షైనీ) ఎంట్రీ ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై తన గ్లామర్ తో మాయ చేసిన ఫ్లోరా షైనీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా హంగామా చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

ఆమె వృత్తి జీవితం మరియు వ్యక్తిగత అనుభవాలు

బిగ్ బాస్ సీజన్ 9 వేదికపైకి రాగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వివరించింది. నాగార్జున ఆమెని ఆశా సైనీ అని పిలిచారు. అలా వద్దు సార్.. నన్ను ఫ్లోరా షైనీ అని పిలవండి. ఎందుకంటే అది నా ఒరిజినల్ నేమ్ అని తెలిపింది. బిగ్ బాస్ 9 వేదికపై ఫ్లోరా షైనీ ఎవి ప్రదర్శించారు. ఈ ఎవిలో ఫ్లోరా షైనీ తన కెరీర్, లైఫ్ సృగుల్స్ గురించి తెలిపింది. నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాల్లో నటించాను. కాలేజ్ తర్వాత మోడలింగ్ లో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నాను. ఓవర్ వైట్ కారణంగా నన్ను ఎలిమినేటి చేశారు. ఆ తర్వాత పట్టుదలతో బరువు తగ్గి నాజూగ్గా మారి మరోసారి బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొని విన్నర్ గా నిలిచా. ఆ టైం ఈవీవీ సత్యనారాయణ గారు చాలా బావుంది మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ ఇలా తెలుగు తమిళ భాషల్లో 50 వరకు సినిమాలు చేశాను.

ప్రేమ వల్ల కలిగిన బాధ, హింస

తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ అందరిలాగే తాను కూడా ప్రేమలో పడ్డానని ఫ్లోరా షైనీ పేర్కొంది. కానీ ఆ ప్రేమ తనకి కన్నీళ్ళని మాత్రమే మిగిలినట్లు ఫ్లోరా షైనీ భావోద్వేగానికి గురైంది. ప్రేమించిన వ్యక్తి నన్ను ఫిజికల్ గా టార్చర్ చేశారు. మానసికంగా వేధిస్తూ, నా వ్యక్తిత్వంపై మచ్చ వేశాడు. ఆ ప్రేమ వల్ల ఎంతో వేదన అనుభవించా. ఫిజికల్ గా అటాక్ కి కూడా గురయ్యా అని ఫ్లోరా షైనీ పేర్కొంది. ఆ టైంలో తన తల్లి దండ్రులు తప్ప ఇంకెవరూ మద్దతు ఇవ్వలేదని ఫ్లోరా షైనీ పేర్కొంది. ఆ సంఘటన వాళ్ళ నిజమైన ప్రేమ పై నమ్మకం పోయింది అని ఫ్లోరా పేర్కొంది. ఇంకా జీవితం ఉంది కాబట్టి నిజమైన ప్రేమ దొరుకుతుందేమో చూడాలి అని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లోరా షైనీ వయసు 46 ఏళ్ళు.

ఫ్లోరా షైనీ జీవితంలోని కష్టాలను, ప్రేమ విషయంలో ఎదుర్కొన్న హింసను బయటపెట్టడం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆమె ఎంట్రీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆమె భవిష్యత్తులో నిజమైన ప్రేమను కనుగొంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.