|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 షురూ.. ఈసారి రెండు ఇళ్లు, బిగ్‌బాసే మారుతున్నాడు!

Published: 28-08-2025, 7:45 AM
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 షురూ.. ఈసారి రెండు ఇళ్లు, బిగ్‌బాసే మారుతున్నాడు!

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్! బిగ్ బాస్ తెలుగు 9 షో వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో రెండు ఇళ్ళు, నాగార్జున వ్యాఖ్యాతగా, మరియు బిగ్ బాస్ లోనే కొన్ని మార్పులుంటాయని తెలుస్తోంది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభం.

2

ఈసారి రెండు ఇళ్ళు – ఒకటి సెలబ్రిటీలకు, మరొకటి కామన్ మ్యాన్ కు.

4

అగ్నిపరీక్ష షో ద్వారా కామన్ మ్యాన్ కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు.

బిగ్ బాస్ 9 ప్రారంభ తేదీ

బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్‌బాస్‌ 9 షో ( Bigg Boss 9 Telugu ) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్‌బాస్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ 9 ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈసారి కూడా కింగ్‌ నాగార్జునే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 9వ సీజన్‌ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్‌లు ఉంటాయన్నారు. ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్‌ మ్యాన్‌ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్‌బాస్‌నే మారుస్తున్నట్లు చెప్పాడు నాగ్‌. అంటే బిగ్‌బాస్‌ వాయిస్‌ మారొచ్చని తెలుస్తోంది.

అగ్నిపరీక్ష ఇప్పటికే కామన్‌ మ్యాన్‌ కోసం సెలక్షన్‌ జరుగుతోంది. హాట్‌స్టార్‌లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్‌ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్‌ కూడా ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించవచ్చని తెలుస్తోంది. అలాగే అగ్నిపరీక్ష షో జడ్జిలైన బిందు మాధవి, నవదీప్‌, అభిజిత్‌.. ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లను సెలక్ట్‌ చేసి డైరెక్ట్‌గా పంపించవచ్చని భోగట్టా! మరి హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే!

రెండు ఇళ్ళు మరియు కామన్ మ్యాన్

నాగార్జున మరియు బిగ్ బాస్ మార్పులు

బిగ్ బాస్ తెలుగు 9 షో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే. రెండు ఇళ్ళు, కొత్త మార్పులు, నాగార్జున – ఇవన్నీ ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.