
📌 Key Points
- బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు.
- హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ, రూ.35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు.
- కామనర్‌గా బిగ్ బాస్ లో అడుగు పెట్టి, అత్యధిక ఓట్లు సాధించాడు.
- విజయనగరానికి చెందిన కల్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీలో సీఆర్‌పీఎఫ్ జవాన్.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. ఉత్కంఠకు తెరదించుతూ, కామనర్‌గా అడుగుపెట్టిన ఈ సైనికుడు అత్యధిక ఓట్లతో ట్రోఫీని గెలుచుకున్నారు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా రూ.35 లక్షల ప్రైజ్ మనీ అందుకుని, లక్షలాది మంది అభిమానులను గెలుచుకున్నారు.
బిగ్‌బాస్ ట్రోఫీ కల్యాణ్ పడాలకే!
ఉత్కంఠకు తెర వీడింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్-9(Bigg Boss Season 9) విజేతగా కల్యాణ్ పడాల(Kalyan Padala) నిలిచారు. ఈ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున (Nagarjuna) అధికారికంగా ప్రకటించారు. దీంతో కల్యాణ్‌కు రూ.35లక్షల ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన కల్యాణ్ పడాల.. కష్టపడి ఇండియన్ ఆర్మీలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా చేరాడు. మూడేళ్లుగా సరిహద్దుల్లో దేశ సేవ చేస్తున్నాడు. కామనర్‌గా బిగ్ బాస్ లో అడుగు పెట్టి.. సెలబ్రిటీలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కూడా నెగ్గి.. ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటాడు. తనదైన గేమ్‌తో, యాటీట్యూడ్‌తో ఆకట్టుకున్న కల్యాణ్.. అందరి దృష్టిని ఆకర్షించాడు. సామన్యుల కోటాలో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కప్పును సాధించాడు. దీంతో కల్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కామనర్‌గా వచ్చి సెలబ్రిటీలకు షాక్!
కల్యాణ్ పడాల ప్రస్థానం.. సైనికుడి నుంచి విజేతగా!
కామనర్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన కల్యాణ్ పడాల, తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. సామాన్యుడు కూడా విజేతగా నిలవగలడని నిరూపిస్తూ, బిగ్‌బాస్ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించాడు.


