|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిషపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు! ఒక్కసారిగా వెనక్కి తగ్గిన వైనం!

Published: 16-02-2026, 8:35 AM
  • నటి త్రిష గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
  • విజయ్, త్రిషల మధ్య సంబంధం గురించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • విమర్శల నేపథ్యంలో త్రిష లీగల్ నోటీసులు జారీ చేయడంతో నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు.
  • రాజకీయాల కోసం సెలబ్రిటీల పేర్లను వాడటం సరికాదని త్రిష తరపు న్యాయవాది హెచ్చరించారు.

ప్రముఖ నటి త్రిష గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన వెంటనే స్పందించి త్రిషకు క్షమాపణలు చెప్పారు.

త్రిషపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Actress Trisha: తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతూ.. వివాదాలకు దూరంగా ఉంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష (Trisha)ఇటీవల తమిళ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ఈమె గురించి ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (Nainar Nagendran ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దమారం రేగాయి. తమిళనాడులో మరికొద్ది నెలలు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుంటూ వారిపై విమర్శలు కురిపిస్తున్నారు. సినీ నటుడు విజయ్ సైతం ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విజయ్ ని విమర్శిస్తూ హీరోయిన్ త్రిషపై  చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ హీరో విజయ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. విజయ్ కి రాజకీయాలు ఏమాత్రం తెలియవు కానీ, త్రిషతో ఉన్న బంధం గురించి బయటకు రావాలి అప్పుడే తమిళనాడులో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి అంటూ ఈయన ఏకంగా త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి.

దుమారం రేపిన త్రిష-విజయ్ సంబంధం కామెంట్స్

ఇలా త్రిష నటుడు విజయ్ కి మధ్య రిలేషన్ ఉందంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు అయితే ఈ విషయాన్ని పలువురు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు ఖండించారు. మీ రాజకీయాల కోసం సినిమా సెలబ్రిటీల పేర్లను ఉపయోగించడం సరికాదు అంటూ హెచ్చరించారు. ఇలా త్రిష గురించి నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఈ విషయంపై త్రిష స్పందిస్తూ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. త్రిష తరఫున ఆమె న్యాయవాది నాగేంద్రకు హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా..

వెనక్కి తగ్గిన నాగేంద్రన్.. క్షమాపణలు

త్రిష ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుబంధం లేదు కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం త్రిష పేరును వాడటం సరికాదని, అనవసర విషయాలల్లో లాగితే చట్ట పరమైన చర్యలు తప్పవని,  ప్రజా ప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతగా ప్రవర్తించాలి అంటూ త్రిష తరపు లాయర్ ప్రకటన విడుదల చేశారు. త్రిష నుంచి ఈ విషయంపై స్పందన రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్  నాగేంద్రన్ సైతం ఈ వివాదం పై స్పందించారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. తనకు ఎవరి మనసును బాధ పెట్టే ఉద్దేశం లేదంటూ ఈయన  త్రిష గురించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలియజేశారు. ఇలా నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడిందనే తెలుస్తుంది.

చివరికి, త్రిషకు నయనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రాజకీయాల్లో సెలబ్రిటీల పేర్లను వాడటం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.