|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్: ఆప్ చీలిక వెనుక అసలు కథ!

Published: 30-04-2026, 10:00 PM
కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్: ఆప్ చీలిక వెనుక అసలు కథ!
  • ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చడానికి బీజేపీ ‘రాజకీయ ఆపరేషన్’ చేసిందని కథనం.
  • రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఏడుగురు సభ్యులతో కలిసి బీజేపీలో విలీనమయ్యారు.
  • కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, ఢిల్లీ మద్యం కేసు ఆప్ ప్రతిష్టను దెబ్బతీశాయి.
  • ప్రతిపక్ష గొంతును అణచివేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

అవినీతి రహిత రాజకీయాల లక్ష్యంతో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు బీజేపీ ‘రాజకీయ ఆపరేషన్’తో నిలువునా చీలిపోయింది. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఏడుగురు సభ్యులతో కలిసి బీజేపీలో విలీనం కావడంతో, కేజ్రీవాల్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆప్ చీలిక: బీజేపీ వ్యూహం ఎలా పని చేసింది?

అవినీతికర రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే బలమైన కోరికతో సామాన్యుడి గొంతుగా 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు నిలువునా చీలిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం. ఆప్ పార్లమెంటరీ గ్రూప్ నేతగా కొనసాగుతూ వస్తున్న ఎంపీ రాఘవ్ చద్దా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడాన్ని, వారి వెనుక దాగిన అధికార కాంక్షను విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్న రాఘవ్ చద్దా.. పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రధాని మోడీ మీద అవసరమైన సందర్భాల్లో విమర్శలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఆప్ నేతలు ఇటీవల విమర్శించారు.. ఈ నేపథ్యంలోనే, ఆయనను డిప్యూటీ నేత పదవి నుంచి తొలగించారు. ఎంపీ అశోక్ మిట్టల్‌ను ఆ స్థానంలో నియమించారు. ఇక అశోక్ మిట్టల్ ఆప్ డిప్యూటి నేతగా బాధ్యత చేపట్టిన మరునాడే తన నివాసంఫై ‘ఈడీ’ దాడులు ప్రారంభమైనాయి. అంతకు ముందే కొంతమంది ఆప్ రాజ్యసభ సభ్యుల ఆస్తులపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి. దీంతో గత కొంత కాలంగా లోపాయికారంగా అధికార బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్న రాఘవ్ చద్దా రాజ్యసభలోని 10 మంది ఆప్ సభ్యులలో 7 గురితో గ్రూపుగా ఏర్పడి ఆ పార్టీకి రాజీనామా చేసి మూడింట రెండు వంతుల మెజార్టీతో బీజేపీలో విలీనమైనట్లు ప్రకటించారు..

రాఘవ్ చద్దా రాజీనామా: అసలు కారణం ఇదేనా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌తో వీరి భేటీ చూస్తుంటే ‘ రాజకీయ ఆపరేషన్’ స్పష్టంగా కనిపిస్తుంది. ఆప్‌పై వస్తున్న విమర్శలలో డబ్బులున్న ధనికులకు, వ్యాపార పారిశ్రామికులకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టడమే ఆప్ చేసిన తప్పిదమని ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నాయకులను ఇరికించి, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టులు, కోర్టుల విచారణలు ప్రజలలో ఆప్‌ను పలుచన చేశారు. అవినీతిని అంతం చేస్తామని వచ్చిన పార్టీ, ఆరోప ణల్లో చిక్కుకోవడం రాజకీయ విరోధాభాసంగా మారింది. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో బలమైన ఉనికి కలిగి జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆప్‌ను లోపలి నుండే దెబ్బ తీయడం ద్వారా ప్రతిపక్ష గొంతును నిర్వీర్యం చేయడం ఇక్కడ బీజేపీ అనుసరించిన ప్రధాన ఎత్తుగడ.

ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకో వడంతో ఫిరాయింపుల చట్టం ప్రహసన ప్రాయమని మరోసారి తేలిపోయింది. విపక్షాలను బలహీనపరిచి తన శక్తిని పెంచుకోవాలని బీజేపీ వ్యూహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. పంజాబ్‌లో బీజేపీకి దక్కింది గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు మాత్రమే. పంజాబ్ నుండి ఆప్‌కు 6 గురు ఎంపీల ప్రాతినిధ్యం ఉన్నది. బహుశా తొందర్లోనే ఎన్నికల ముంగిట్లో ఉన్న పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వానికి గండం తప్పకపోవచ్చు..

కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్ర: ఆప్ బలహీనపడటానికి కారణమా?

ఒక పార్టీ నుండి అసెంబ్లీ‌కైన, పార్లమెంట్‌కైనా ఎన్నికైన పార్టీ అభ్యర్థులు.. అవకాశవాద రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు దిగజారి పార్టీలు ఫిరాయిస్తే తక్షణమే వారి పదవి కోల్పోయే విధంగా సమగ్రమైన చట్టం రూపొందించాలి.. అప్పుడే పార్టీ ఫిరాయిం‌పులను ఆపగలుగుతాం.

సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకులు

ఆప్ చీలిక వెనుక బీజేపీ వ్యూహం, కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘రాజకీయ ఆపరేషన్’ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.