
సాయి కుమార్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అరి’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. “ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును” అనే బోల్డ్ డైలాగ్‌తో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం ‘మై నేమ్ ఈజ్ నోబడి’ ట్యాగ్‌లైన్‌తో అక్టోబర్ 10న విడుదల కానుంది. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
Key Points
సాయి కుమార్, అనసూయ ప్రధాన పాత్రల్లో 'అరి' సినిమా
'మై నేమ్ ఈజ్ నోబడి' ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతుంది
కామం నేపథ్యం, బోల్డ్ డైలాగ్స్‌తో ట్రైలర్ విడుదల
అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు 'అరి' రాబోతుంది
అరి మూవీ కథా నేపథ్యం
సాయి కుమార్(Sai Kumar), అనసూయ(Anasuya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అరి’(ari). ‘మై నేమ్ ఈజ్ నోబడి’ ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఇందులో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ మనిషిలోని ఎమోషన్స్‌ను అందరికీ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అరి’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇక ఇందులో కామం అనే పదంతోనే అన్ని డైలాగ్స్ ఉంటాయి. ముందుగా శ్రీకృష్ణుడి జీవితంలో జరిగింది చెప్తుండగా.. ఓ మహిళ లైబ్రరీకి వెళ్లి కోరిక ఏదైనా తీరుస్తారా? అని ఓ వ్యక్తిని అడుగుతూ కనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం బోల్డ్ డైలాగ్స్ ఉండగా.. లైబ్రరీలోనే షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక చివరగా.. ‘‘ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును’’ అనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు.
సాయి కుమార్, అనసూయ కీలక పాత్రలు
ట్రైలర్‌లో బోల్డ్ డైలాగ్స్
‘అరి’ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. కామం అనే అంశంపై బోల్డ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


