|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బోల్డ్ ఓటీటీ: ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం పెద్దలకు మాత్రమే.. మొత్తం అలాంటి కంటెంటే..

Published: 05-05-2025, 12:45 PM

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో బోల్డ్ కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, కొన్ని ఓటీటీలు పెద్దలకు మాత్రమే అనుకూలమైన కంటెంట్‌ను అందిస్తున్నాయి. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Key Points

1

ఉల్లు, ALT Balaji, మరియు ఈ వూవి వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రధానంగా పెద్దలకు మాత్రమే ఉద్దేశించబడ్డాయి.

2

ఈ ప్లాట్‌ఫామ్‌లు బోల్డ్ మరియు ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్‌ను అందిస్తాయి.

4

కూకు వంటి మరిన్ని ఓటీటీలు పెద్దలకు మాత్రమే అనుకూలమైన కంటెంట్‌ను ప్రదర్శిస్తాయి.

పెద్దలకు మాత్రమే అయిన ఓటీటీలు

ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాల్సిందే అన్న డిమాండ్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలుసు కదా. అంతలా బోల్డ్ కంటెంట్ ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెళ్తోంది. కొన్నిసార్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ లోనూ బోల్డ్ సీన్లు, బూతులు ఉంటున్నాయి. అయితే మొత్తంగా బోల్డ్ కంటెంట్ కోసమే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అవేంటో చూడండి.

ఉల్లు అంటే గుడ్లగూబ అని అర్థం. ఇండియాలో బోల్డ్ కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇదీ ఒకటి. 2018లో మొదలైంది. ప్రతి వారం ఇందులోకి హాట్ హాట్ వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అంతా ఎ రేటెడ్ కంటెంటే. కేవలం పెద్దలకు మాత్రమే. పిల్లలను అసలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దగ్గరికి కూడా వెళ్లనీయొద్దు.

ఏఎల్‌టీ బాలాజీ (ALT Balaji)

బోల్డ్ కంటెంట్‌ను అందించే ప్లాట్‌ఫామ్‌లు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ మొదలుపెట్టిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ ఏఎల్‌టీ బాలాజీ. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్ ఇందులో చాలా పాపులర్. అసలు ఇండియాలో బోల్డ్ కంటెంట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సిరీస్ ఇది. ఈ ప్లాట్‌ఫామ్ అన్నీ అలాంటి సిరీసే కనిపిస్తాయి.

ఈ వూవి కూడా అంతే. ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. 2022 నుంచీ ఈ ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో బోల్డ్ వెబ్ సిరీస్, అడల్ట్ కంటెంట్ ఇందులో చూడొచ్చు. ఏటీఎం భాబీ, ప్యార్ ఇదర్ ఉదర్ లాంటి సిరీస్ ఇందులో పాపులర్.

కూకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 2020లో లాంచ్ అయింది. ఇందులోనూ పెద్దలకు మాత్రమే అనే బోల్డ్ వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి.

ప్రముఖ బోల్డ్ వెబ్ సిరీస్‌లు

ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)

ఈమధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్. ఇందులో అన్ని జానర్ల కంటెంట్ ఉన్నా కూడా గతంలో కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువగా వచ్చేది. ఇప్పటికీ అలాంటి కంటెంట్ చాలానే ఉంది. ఆశ్రమ్, మస్త్రమ్ లాంటి వెబ్ సిరీస్ ఇందులో ఉన్నాయి.

వావ్ కూడా అడల్ట్ కంటెంట్ మాత్రమే అందించే మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్. దీంతోపాటు బేషరమ్స్, అత్రంగిలాంటివి కూడా బోల్డ్ వెబ్ సిరీస్ ఉన్న ఓటీటీలే.

చివరగా, బోల్డ్ కంటెంట్ అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.