|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒక్క డైలాగ్ లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీ మూవీ.. 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో!

Published: 01-09-2025, 6:41 AM
ఒక్క డైలాగ్ లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీ మూవీ.. 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో!

డైలాగ్స్ లేకుండా తెరకెక్కిన ‘ఉఫ్ఫ్ యే సియాపా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ తరహాలో ఈ సినిమా కూడా సైలెంట్ కామెడీ-థ్రిల్లర్ గా ఉంటుందని చెబుతున్నారు.

Key Points

1

డైలాగ్ లేని బోల్డ్ సైలెంట్ కామెడీ-థ్రిల్లర్ 'ఉఫ్ఫ్ యే సియాపా'

2

ఏఆర్. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అద్భుతమైన అనుభవం

4

40 ఏళ్ళ తర్వాత పుష్పక విమానం తరహా సైలెంట్ సినిమా

డైలాగ్‌ లేని సినిమా ప్రయోగం

భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు. కానీ, ఒక సినిమాకు అందులో వచ్చే డైలాగ్స్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలో అసలు సంభాషణలు లేకుండా తెరకెక్కించే ధైర్యం చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన సినిమా ఉఫ్ఫ్ యే సియాపా. ఈ సినిమా సరికొత్త నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ బోల్డ్ సైలెంట్ కామెడీ-థ్రిల్లర్ డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది.

పూర్తిగా హావభావాలతో, పర్ఫామెన్స్‌ని ఆధారంగా చేసుకుని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికగా ఉఫ్ఫ్ యే సియాపా సినిమా తెరకెక్కనుంది. ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశేషం.

ఉఫ్ఫ్ యే సియాపా కథాంశం

ఉఫ్ఫ్ యే సియాపా సినిమా కేసరి లాల్ సింగ్ ( తుంబాడ్ ఫేమ్ సోహుమ్ షా) గందరగోళ జీవితం చుట్టూ తిరుగుతుంది. పొరపాటున జరిగిన ఒక పార్సిల్ డెలివరీ, వరుస అపార్థాలు అతని ఇంటిని నేర స్థలంగా మారుస్తాయి.

కేసరి భార్య పుష్ప (నుష్రత్ భరుచ్చ) అతను తమ పొరుగున ఉన్న కామిని (నోరా ఫతేహి)తో సరసాలాడుతున్నాడని అనుమానిస్తుంది. అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తరువాత కేసరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎటువంటి ఆసక్తిని ఎంతటి హాస్యాన్ని కురిపిస్తాయి అన్నదే ఉఫ్ఫ్ యే సియాపా కథ.

పిల్ల జమిందార్, భాగమతి , దుర్గామతి వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జి. అశోక్ ఎల్లప్పుడూ సరికొత్త శైలులతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఉఫ్ఫ్ యే సియాపాతో ఆధునిక ప్రేక్షకుల కోసం నిశ్శబ్ద కథ చెప్పడం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పొచ్చు.

ఏఆర్. రెహమాన్ సంగీతం

తన కథను ఇతర టెక్నీషియన్స్‌కి, నటీనటులకు అర్థం అయ్యేలా చెప్పి వారి నుంచి సినిమాను అర్థవంతంగా తీసేలా చేయడం నిజమైన ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే, ఇలాంటి సైలెంట్ సినిమా 40 ఏళ్ల క్రితం పుష్పక విమానం వచ్చింది. ఇందులో హీరోగా కమల్ హాసన్ చేశారు.

మరి 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో వస్తోన్న ఉప్ఫ్ యే సియాపా సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

40 ఏళ్ళ తరువాత వస్తున్న ఈ సైలెంట్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.