|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ వారంగ్‌ హఠాన్మరణం

Published: 06-09-2025, 3:12 PM
బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ వారంగ్‌ హఠాన్మరణం

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. ‘సూర్యవంశీ’, ‘దృశ్యం’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన మృతికి సినీ ఇండస్ట్రీ సంతాపం తెలుపుతోంది.

Key Points

1

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం

2

‘సూర్యవంశీ’, ‘దృశ్యం’, ‘మర్దానీ’ వంటి సినిమాల్లో నటించారు

4

నటీనటులు, దర్శకులు సంతాపం తెలిపారు

ఆశిష్ వారంగ్ మృతి

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్‌ వారంగ్‌ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్‌ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.

సినిమా రంగంలో విషాదం

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్‌ రోల్‌ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘ఏక్‌ విలన్‌’ వంటి పలు హిట్‌ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్‌ వారంగ్‌.

మృతికి కారణం తెలియని రహస్యం

హిందీ సినిమాల్లోనే కాదు… మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్‌ వారంగ్‌ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే… ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్‌ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి.

ఆశిష్ వారంగ్ మృతితో బాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ఆయన మృతికి కారణం ఇంకా వెల్లడించబడలేదు. సినిమా రంగం ఆయనకు నివాళులు అర్పిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.