
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో స్టార్ నటుడు గోవిందా ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన గోవిందా ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Key Points
బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో స్పృహ కోల్పోయారు.
వెంటనే ముంబైలోని క్రిటికేర్ ఆసియా ఆసుపత్రికి తరలించారు.
గోవిందా ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది.
గోవిందా ఇంట్లో స్పృహ కోల్పోవడం
ఓ వైపు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చనిపోయారనే తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ స్టార్ గోవిందా ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బాలీవుడ్ లో మరో స్టార్ హీరో, నటుడు గోవింద అనారోగ్య పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తోంది. గోవిందాను బుధవారం (నవంబర్ 12) ముంబైలోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. గోవిందా ఇంట్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. గోవింద్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హుటాహుటిన క్రిటికేర్ ఆసుపత్రికి తరలింపు
అభిమానుల ఆందోళన, ధర్మేంద్ర ప్రస్తావన
గోవిందా ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉండగా ఈ వార్త బాలీవుడ్ లో విషాదం నింపింది. అభిమానులు తమ అభిమాన నటులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


