|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 16 ఎపిసోడ్: రేవతి ఇంటికి అపర్ణ.. దుగ్గిరాల కుటుంబంలో ఆనందం.. కావ్య గుండె ముక్కలు

Published: 16-09-2025, 11:08 AM
బ్రహ్మముడి సెప్టెంబర్ 16 ఎపిసోడ్: రేవతి ఇంటికి అపర్ణ.. దుగ్గిరాల కుటుంబంలో ఆనందం.. కావ్య గుండె ముక్కలు

బ్రహ్మముడి సీరియల్‌లోని 827వ ఎపిసోడ్‌లో దుగ్గిరాల కుటుంబంలో రేవతి తిరిగి రావడంతో ఆనందం వ్యాప్తిస్తుంది. కానీ అపర్ణ, కావ్యలకు సంబంధించిన సంఘర్షణ కథనంలో ప్రధాన ఆకర్షణ.

Key Points

1

రేవతి తన కుటుంబానికి తిరిగి వస్తుంది.

2

దుగ్గిరాల కుటుంబంలో ఆనందం వ్యాప్తిస్తుంది.

4

అపర్ణ రేవతిని క్షమించే అవకాశం ఉందా?

రేవతి తిరిగివచ్చిన సంతోషం

బ్రహ్మముడి ఈరోజు అంటే 827వ ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబంలో ఓవైపు సంతోషం, మరోవైపు బాధ చూడొచ్చు. రేవతి తిరిగి తన కుటుంబానికి దగ్గరవడంతో అందరూ సంతోషిస్తారు. కానీ అటు కావ్య గుండె మాత్రం ముక్కలవుతుంది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి.

అపర్ణకు సర్ది చెప్పిన ఇందిర, రాజ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ రేవతి ముసుగు తొలగిపోయిన తర్వాత రుద్రాణికి ఇందిరా దేవి క్లాస్ పీకే సీన్ తో మొదలైంది. తెలిసీ తెలియని వయసులో దానికి లేనిపోనివి నూరిపోసి పంపించింది నువ్వే కదా అని రుద్రాణిని ఇందిర తిడుతుంది. ఇప్పుడు రేవతి గురించి మాట్లాడిల్సింది కేవలం అపర్ణే అని, ఆమె క్షమించాలని అంటుంది.

అటు రాజ్ కూడా తల్లికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నా ఆపే వయసు అప్పట్లో తనది కాదని అంటాడు. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ల తప్పులను కూడా అంగీకరించాలని నువ్వు చెప్పావు కదమ్మా.. మరి ఎందుకు అక్కకు ఇంత శిక్ష అని అడుగుతాడు.

ఆమె రేవతి అని తనకు తెలుసన్న అపర్ణ

దీంతో అపర్ణ స్పందిస్తుంది. ముసుగు వేసుకొని వచ్చింది రేవతి అని తనకు ముందే తెలుసని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. తన మాట వినకుండా పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన రేవతిని ఎప్పటికీ క్షమించకూడదని అనుకున్నట్లు చెబుతుంది.

అపర్ణ, రేవతి మధ్య సంఘర్షణ

ఇంతకుముందు ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచీ రేవతిపై తన కోపం మరింత పెరిగిందని కూడా అంటుంది. కానీ గతంలోనే తాను రేవతి ఇంటికి వెళ్లిన విషయం కూడా చెబుతుంది. తన ఫ్రెండ్ స్వరాజ్ ను దింపడానికి వెళ్లి అతడు తన కూతురి కొడుకే అన్న విషయం ఆమె చాలా రోజుల కిందే తెలుసుకుంటుంది.

రేవతి మాటలు విని అపర్ణ ఎమోషనల్

గతంలో అపర్ణ రేవతి ఇంటికి వెళ్లినట్లుగా ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తారు. తన ఫ్రెండ్ స్వరాజ్ ను ఓసారి ఇంట్లో దిగబెట్టడానికి వెళ్తుంది. అతడు ఇంట్లోకి రావద్దని, మా అమ్మ లేదని అపర్ణకు చెబుతాడు. ఇంట్లోకి వెళ్లి మీ అమ్మే తనను తీసుకొచ్చిందని రేవతికి స్వరాజ్ చెబుతాడు. ఇంతలో అతడు కారులోనే వాటర్ బాటిల్ మరచిపోవడంతో అది ఇవ్వడానికి లోనికి వెళ్తుంది అపర్ణ.

అక్కడ రేవతి, జగదీశ్ ఉండటం చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ రేవతి మాటలు ఆమె మనసు కరిగిస్తాయి. తాను చేసిన తప్పుకు తన తల్లి అలా స్పందించడంలో తప్పు లేదని, అప్పుడైనా, ఇప్పుడైనా ఎప్పుడైనా తన తల్లి చేసేది కరెక్టే అని రేవతి అంటుంది. తాను వాళ్లను ఎంతో బాధపెట్టానని, ఇప్పుడు తన కొడుకు అంత పెద్ద కుటుంబాన్ని దూరం చేశానని బాధపడుతుంది. బయట నిల్చొని ఆ మాటలన్నీ వింటున్న అపర్ణ ఆవేశం కాస్తా చల్లారి బాధగా మారుతుంది.

అపర్ణ కాళ్లు పట్టుకున్న రేవతి.. క్షమించమన్న అపర్ణ

ఆ రోజే తాను రేవతిని తిరిగి కూతురిగా అంగీకరించినట్లు అపర్ణ ఇంట్లో వాళ్లకు చెబుతుంది. అప్పటి నుంచి ఆమె ఎప్పుడు వచ్చి అడిగినా.. వెంటనే ఇంటికి పిలవాలని భావించినానని అంటుంది. ముసుగు వేసుకొచ్చినంత మాత్రాన తన కూతురని తెలుసుకోలేనా? ఆమె ఊపిరి తగిలినా తన కూతురే అని చెప్పగలనని అపర్ణ అంటుంది.

కావ్య బాధ

దీంతో రేవతి తన తల్లి కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతుంది. నేను కాదు నువ్వే నన్ను క్షమించాలని అపర్ణ అడుగుతుంది. స్వరాజ్ ను కూడా దగ్గరకు తీసుకొని ఇన్నాళ్లూ నీకు నిజం తెలిసినా నా దగ్గర దాచావా అని అపర్ణ అంటుంది. తాను నిజం దాచకపోయి ఉంటే ఇప్పుడిది జరిగి ఉండేది కాదు కదా అని స్వరాజ్ అంటాడు.

కావ్య వల్లే ఇదంతా అన్న అపర్ణ

ఇదంతా చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇది కేవలం కావ్య వల్లే సాధ్యమైందని అపర్ణ అంటుంది. తాను ఎంత తిట్టినా, అవమానించినా రేవతిని తనకు దగ్గర చేయడానికి ఆమె ఎంతో చేసిందని పొగుడుతుంది. అక్కను ఇంటికి తీసుకొచ్చింది తానైతే క్రెడిట్ మొత్తం నీ కోడలికే ఇచ్చేస్తావా అని రాజ్ అంటాడు. ఆమె నీ రక్త సంబంధం.. అది నీ బాధ్యత అని సుభాష్ అనడంతో మరి నేను పరాయిదాన్నా అని కావ్య అడుగుతుంది. దీంతో ఇప్పుడే రేవతి కలిసింది.. నువ్వు మరొకటి మొదలుపెట్టకు అని అపర్ణ నవ్వుతూ అంటుంది.

ఇటు రేవతి కలిసిపోవడం, దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందంగా ఉండటంతో తాను ఓ కథ రాయాలని అనుకుంటున్నట్లు అప్పుతో కల్యాణ్ చెబుతాడు. కానీ ఆమె మాత్రం బాధగా ఉంటుంది. ఆ తల్లికి కూతురు దగ్గరైందేమో కానీ మరో తల్లికి తన బిడ్డ దూరమవుతున్న విషయం మరచిపోయావా అని కల్యాణ్ ను అడుగుతుంది. అక్కకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదని బాధపడుతుంది.

ఆ తర్వాత అందరూ హాల్లో కావ్యకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఎవరూ పుట్టరు.. ఒకవేళ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావని అప్పు చెబుతుంది. ఏది ఏమైనా తాను తన బిడ్డను దూరం చేసుకోనని బాగా ఎమోషనల్ అయిపోయిన కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, రేవతి తన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటుందా లేదా కావ్య బాధలకు కారణమవుతుందా అనేది మరిన్ని ఎపిసోడ్స్ చూస్తేనే తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.