|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 20 ఎపిసోడ్: పిచ్చోడిలా రాజ్- కావ్యను కాపాడుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్- రాహుల్ బుట్టలో పడిన స్వప్న

Published: 22-09-2025, 12:32 AM
బ్రహ్మముడి సెప్టెంబర్ 20 ఎపిసోడ్: పిచ్చోడిలా రాజ్- కావ్యను కాపాడుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్- రాహుల్ బుట్టలో పడిన స్వప్న

బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య గర్భం గురించి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాజ్, డాక్టర్లతో వాదించి కావ్య మరియు బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. స్వప్న కూడా కష్టాలను ఎదుర్కొంటుంది.

Key Points

1

రాజ్, కావ్య గర్భం గురించి డాక్టర్‌తో వాదించాడు.

2

కావ్య ప్రాణాలను కాపాడటానికి రాజ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

4

స్వప్న రాహుల్ బుట్టలో పడింది.

డాక్టర్‌తో రాజ్ తీవ్ర వాదన

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డాక్టర్‌ను రాజ్, కల్యాణ్ కలుస్తారు. కావ్యను కాపాడమని రాజ్ చెబితే.. మీరు ఏంటీ మళ్లీ మొదటికి వచ్చారు. మీరు అబార్షన్‌కు కావ్యను ఒప్పించారని చెప్పడానికి వచ్చానని అనుకుంటున్నాను అని డాక్టర్ కోప్పడుతుంది. తను ఇప్పటివరకు సంతోషంగా లేదు. ఇప్పుడే ఉంటుంది. మా ఇద్దరికి పుట్టబోయే మొదటి సంతానాన్ని ఎలా చంపుకోమంటారు అని రాజ్ ఎమోషనల్‌గా అడుగుతాడు.

మీరు చెబుతుంది నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇప్పుడున్న దారిలో అబార్షన్ తప్పా ఇంకోటి లేదు. కావ్య గర్భసంచి చాలా వీక్‌గా ఉంది. ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించండి అని డాక్టర్ అంటుంది. ప్రతిదానికి ఓ దారి కచ్చితంగా ఉంటుంది కదా. అబార్షన్ మాట కాకుండా ఇంకో మాట చెప్పండి. నాకు కావ్యతో పాటు కడుపులోని బిడ్డ కూడా కావాలి అని వేడుకుంటాడు రాజ్.

మీకు చెబితే అర్థం కావట్లేదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారేంటీ. అబార్షన్ తప్పా ఇంకో దారి లేదు. ఇప్పుడు చేస్తే తను బతుకుతుంది. ఇలా లేట్ చేస్తూ పోతే తర్వాత అబార్షన్ కూడా చేయలేం. దాంతో తల్లీబిడ్డలు ఇద్దరు చనిపోతారంటే అర్థం చేసుకోరేంటీ అని డాక్టర్ కోప్పడుతుంది. దాంతో ఒక్కసారిగా లేచి డాక్టర్‌పై అరుస్తాడు రాజ్.

మీకే అర్థం కావట్లేదు. ఓ తండ్రి పడే ఆవేదన అర్థం చేసుకోవట్లేదు. మెడికల్‌లో కూడా ఏఐ టెక్నాలజీ ఉందిగా. దాని ద్వారా ఓ తల్లి బిడ్డలను కాపాడలేరా. మీరు సింపుల్‌గా ఈజీ రూట్ వెతుక్కుంటున్నారు. నా బిడ్డను కాపాడటం మీకు చేతకావట్లేదు. అసలు మీరు సర్టిఫైడ్ డాక్టరో ఫేక్ సర్టిఫికేట్లతో డాక్టర్ అయ్యారా అని డౌట్‌గా ఉంది. ఓ బిడ్డను కాపాడలేని మీరు ఎందుకు అని రాజ్ చాలా కోప్పడతాడు.

డాక్టర్ దగ్గర ఉన్న వస్తువులను విసిరేస్తాడు. కళావతి బతికితే బిడ్డ బతకదు అన్నారుగా. బతికిస్తా ఇద్దరిని బతికిస్తా. భూగోళంలో జల్లెడ పట్టైన సరే ఇద్దరిని కాపాడుకుంటా అని రాజ్ అనేసి వెళ్లిపోతాడు. రాజ్ చేసిన దానికి కల్యాణ్ సారీ చెబుతాడు. బయట కూడా రాజ్ కోపంగా ఉంటాడు. వీళ్లు అసలు డాక్టర్సే కాదంటూ అరుస్తాడు. ఈ విషయాన్ని కావ్యకు చెబితే ఒప్పుకుంటుందా. ఇంత ఆస్తి పెట్టుకుని బిడ్డను కాపాడుకోలేనప్పుడు ఎందుకురా అని రాజ్ అంటాడు.

కావ్య మరియు బిడ్డ ప్రాణాల రక్షణ

రేయ్ నీకు తెలిసిన డాక్టర్స్ అందరికి కాల్ చేయి చేసి మీ వదిన పరిస్థితి చెప్పు. ఆస్తి అంతా పోయిన సరే వాళ్లిద్దరిని కాపాడుకుంటాను. చేయ్ చేయ్ అని ఆవేశంతో ఊగిపోతాడు రాజ్. ఆవేశపడకని కల్యాణ్ నచ్చజెబుతాడు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. చాలా మంది స్పెషలిస్ట్‌లను అడిగా.. ఈ డాక్టర్ చెప్పిందే వాళ్లు చెప్పారని కల్యాణ్ అంటాడు.

మరోవైపు రాహుల్ మంచివాడిగా స్వప్న దగ్గర నటిస్తుంటాడు. పనివాడిలా బట్టలు వేసుకుని కష్టపడినట్లు యాక్ట్ చేస్తాడు. అది చూసి ఎగతాళిగా మాట్లాడుతుంది స్వప్న. పని చేసి వచ్చాను అని రాహుల్ చెబితే స్వప్న నమ్మదు. నిజం చెబితే ఎవరు నమ్మరు స్వప్న. అది నీ ఇష్టం. బయటకు వెళ్తే ఓ షావుకారి మూటలు ఎత్తే పని ఇచ్చాడు. ఇదిగో కూలీ డబ్బులు వెయ్యి రూపాయలు అని స్వప్నకు ఇస్తాడు రాహుల్.

అది చూసి స్వప్న షాక్ అవుతుంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నువ్వు పని చేయడం ఏంటీ అని స్వప్న అంటుంది. ఇన్నాళ్లు డబ్బు విలువ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. అందుకే నీకు ఇచ్చాను అని చాలా సీరియస్‌గా చెబుతాడు రాహుల్. ఫస్ట్ టైమ్ నిన్ను చూస్తుంటే భర్తగా గౌరవం ఇవ్వాలనిపిస్తుందని స్వప్న అంటుంది. పడింది బుట్టలో అని రాహుల్ అనుకుంటాడు.

మనిషి మారడానికి ఓ కారణం ఉంటుందిగా అని స్వప్న అంటే.. నా కూతురు. నా కూతురే నాకు ఇలా ఉండాలని చెప్పినట్లు అనిపించిందని డ్రామా చేస్తాడు రాహుల్. ఏంటీ వీడు ఇన్ని మాట్లాడుతున్నాడు. నిజంగానే మారాడా అని స్వప్న డౌట్ పడుతుంది. మరోవైపు డాక్టర్స్‌కు రాజ్ కాల్ చేసి కావ్య పరిస్థితి చెబుతాడు. ఒకరికి రిపోర్ట్స్ సెండ్ చేస్తాడు రాజ్.

రాహుల్ బుట్టలో స్వప్న

నీ కష్టానికి దేవుడు అన్యాయం చేయడు అని కల్యాణ్ అంటే.. అసలు దేవుడే లేడురా. పార్వతి తన కొడుకుని కాపాడుకుంది కదరా. మరి భక్తుడి బిడ్డను కాపాడలేదా. అందుకే దేవుడు లేడు అని రాజ్ అంటాడు. ఇంతలో డాక్టర్ కాల్ చేసి వాళ్లు చెప్పింది నిజమే అని చెబుతాడు. దాంతో రాజ్ మరింత ఊగిపోతాడు. పిచ్చోడిలా బిహేవ్ చేస్తాడు. తర్వాత ఇంటికి రాజ్ నిరాశగా వస్తాడు.

ఆఫీస్‌లో ఏదో ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన సమస్యనట. వెళ్లు అని సుభాష్ చెబితే రాజ్ వెళ్లనంటాడు. వంద కోట్ల ప్రాజెక్ట్‌రా. వెళ్లకుంటే చాలా డబ్బు లాస్ అవుతాం. అర్జంట్‌గా వెళ్లు అని రాజ్ చేయి పట్టుకుంటాడు సుభాష్. ఒక్కసారి చెబితే అర్థం కావట్లేదా. నాకు వెళ్లాలని లేదు. కంపెనీకి లాస్ వస్తే రాని. మహా అయితే కంపెనీ మూసేస్తాం. దానికి కొంపలు అంటుకుపోయినట్లు చేస్తారేంటీ అని తండ్రిపై అరుస్తాడు రాజ్.

అదంతా చూసి ఇంట్లోవాళ్లంతా షాక్ అయిపోతారు. కంపెనీ నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడతారు కదరా అని ఇందిరాదేవి అంటుంది. పడితే పడతారు. వాళ్లు జీతం తీసుకోవట్లేదా. నేను వెళ్తేనే పరిష్కారం అయితే వాళ్లంతా ఎందుకు. ఇన్నాళ్లు నాకు గతం గుర్తు లేనప్పుడు మ్యానేజ్ చేశారుగా. ఇప్పుడు కూడా చేయండి అని రాజ్ ఆగ్రహంతో, నిస్సాహాయతతో అరుస్తాడు.

తర్వాత మరో డాక్టర్‌తో కావ్య గురించి రాజ్ మాట్లాడుతాడు. కావ్యను కాపాడుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి. కానీ రిస్క్ కూడా ఉంది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే ఉంది. ఒక్కోసారి ఇద్దరిని కోల్పోయే అవకాశంకూడా ఉంది అని డాక్టర్ చెబుతుంది. దాంతో ఛ అనుకుని వెనక్కి రాజ్ చూసేసరికి అక్కడ కావ్య ఉంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కావ్య మరియు బిడ్డ ప్రాణాలను కాపాడటానికి రాజ్ తన శక్తిమంతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని పట్టుదల మరియు త్యాగాలు ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు. స్వప్న రాహుల్ ప్రభావానికి లోనవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.