|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని మలుపు: రుద్రాణి ఖతం, రేఖ మాస్టర్ ప్లాన్!

Published: 25-02-2026, 11:36 PM
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని మలుపు: రుద్రాణి ఖతం, రేఖ మాస్టర్ ప్లాన్!
  • షాకింగ్: బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణిని త్రిశూలంతో పొడిచి చంపిన కావ్య!
  • రాజ్ తలపై కర్రతో కొట్టి చంపిన రుద్రాణి.. సారీ చెప్పి చనిపోయిన రాహుల్!
  • భర్త జీవచ్ఛవంలా ఐసీయూలో.. కూతురి భవిష్యత్తు గురించి అపర్ణ ఆవేదన!
  • ఆస్తి, అధికారం రేఖ గుప్పిట్లో.. కూతుళ్లతో అపర్ణ కన్నీటి జీవితం!

బ్రహ్మముడి సీరియల్‌లో కళ్ళు చెదిరే ట్విస్ట్! రుద్రాణిని కావ్య చంపడం సంచలనంగా మారింది. దుగ్గిరాల కుటుంబంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

కావ్య చేతిలో రుద్రాణి హతం.. దుగ్గిరాల ఇంట్లో విషాదం!

Brahmamudi Serial February 26th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో పాపలను రుద్రాణి గన్‌తో షూట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజ్ పిలవడంతో కావ్య లేచి అమ్మోరి త్రిశూలంతో రుద్రాణిని పొడిచి చంపేస్తుంది. తన కూతురును బాగా పెంచమని అపర్ణ దగ్గర మాట తీసుకుని చనిపోతుంది కావ్య.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్‌ను గన్‌తో షూట్ చేస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్ తలపై కర్రతో కొడుతుంది. నీ ప్లాన్ సరిగా అమలు చేయలేదని రుద్రాణితో సారీ చెప్పి చనిపోతాడు రాహుల్. దాంతో కోపంగా అదే కర్ర తీసుకుని రాజ్ తలపై పదే పదే కొడుతుంది. నా వారసుడిని చంపావ్ కదా. నీ వారసుడుని చంపేస్తాను అని గన్ పట్టుకుంటుంది రుద్రాణి.

జీవచ్ఛవంలా సుభాష్.. రేఖ కనుసన్నల్లో ఆస్తి, అధికారం!

దాంతో రుద్రాణి చేతిలో ఉన్న గన్ కింద పడుతుంది. కావ్య లేచి కూర్చొంటుంది. రుద్రాణి, రేఖ షాక్ అవుతారు. పిల్లలను కాపాడుతానండి అని రాజ్‌కు చెబుతుంది కావ్య. ఏంటే నా కొడుకుని చంపిన నీ కుటుంబాన్ని, నీ పాపను చంపేస్తాను అని రుద్రాణి అంటుంది. మీరేమైనా దాన ధర్మాలు చేశారా. మిమ్మల్ని అపురూపంగా చూసుకున్నారే. నీ కొడుకుకు మంచి గతే పట్టింది. ఇక మిగిలింది నువ్వే అని కావ్య అంటుంది.

రుద్రాణి చనిపోతుంది. అత్తయ్య నా కూతురు బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నాను. నా చావు నాకు కనిపిస్తుంది. మీ కొడుకుతోనే నా చావు. ఏం జరిగిన సరే నా కూతురుతోనే ఉండాలి. తన భవిష్యత్తును తను ఆశపడినట్లుగా తీర్చి దిద్దండి. దుగ్గిరాల ఇంటి పేరును నా కూతురుకు అందివ్వండి. అలా చేస్తానని మాటివ్వండి అని కావ్య అడుగుతుంది. అపర్ణ కావ్యకు మాటిస్తుంది.

కూతుర్లతో అపర్ణ కన్నీటి గాథ.. బ్రహ్మముడిలో ట్విస్ట్!

నీకేం సమస్య రాదు. దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లు మేము ట్రీట్‌మెంట్ ఇస్తామని వాళ్లు అంటారు. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు హాస్పిటల్‌లో అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. అందరిని కోల్పోయాను, నా భర్త జీవచ్ఛవంలా ఐసీయూలో ఉన్నారు. ఇదంతా కల అయితే బాగుండు. ఇంత బారాన్ని మోయలేక నాకు పిచ్చి పట్టేలా ఉందని ఏడుస్తుంటుంది అపర్ణ .

సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బాగా దెబ్బ తగిలిందని, ఇక నడవలేరని చెబుతాడు. కట్ చేస్తే దుగ్గిరాల కుటుంబం అంతా చనిపోతుంది. అపర్ణ, సుభాష్ బతికి ఉంటారు. ఆస్తి, అధికారం అంతా రేఖ తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. రేఖ దగ్గర కావ్య, అప్పు కూతుళ్లతో అపర్ణ మగ్గిపోతూ బతుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. దుగ్గిరాల కుటుంబంలో ఏం జరుగుతుందో చూడడానికి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.