|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్: ప్రకాశం షాకింగ్ రివర్స్! రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదుగా! అప్పు, కళ్యాణ్ ఎస్కేప్!!

Published: 16-02-2026, 10:05 PM
బ్రహ్మముడి సీరియల్: ప్రకాశం షాకింగ్ రివర్స్! రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదుగా! అప్పు, కళ్యాణ్ ఎస్కేప్!!
  • ధాన్యలక్ష్మి విషయంలో సుభాష్‌పై ప్రకాశం సీరియస్ యాక్షన్!
  • రుద్రాణి, రాహుల్, రేఖ ల మందు పార్టీ, ప్లాన్స్ గురించి డిస్కషన్స్!
  • స్వప్న పాపకు జ్వరం, హాస్పిటల్ కి సుభాష్ తో కలిసి వెళ్ళిన స్వప్న!
  • రాజ్, కావ్యలకు లొకేషన్ లో నిరాశ, అసలు విషయం దాచేస్తున్నారా?

బ్రహ్మముడి సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ లతో కథనం మలుపు తిరుగుతోంది. ప్రకాశం సార్ షాకింగ్ నిర్ణయం, రుద్రాణి కుట్రలు, అప్పు కళ్యాణ్ ల ఎస్కేప్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి!

సుభాష్ పై ప్రకాశం సంచలన వ్యాఖ్యలు!

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీని అనడంతో సుభాష్‌పై ప్రకాశం రివర్స్ అవుతాడు. స్వప్న పాపకు జ్వరం రావడంతో సుభాష్‌తో హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. రుద్రాణి, రాహుల్, రేఖ మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. లొకేషన్ దొరికిందని వెళ్లిన రాజ్, కావ్యకు చుక్కెదురు అవుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్య రేవతి ఇంట్లో ఉండటంపై నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. కల్యాణ్, అప్పును కిడ్నాప్ చేసిందని అపర్ణతో గొడవ పడుతుంది. నానా మాటలు అంటుంది. దాంతో తను నీ అక్క, చూసి మాట్లాడమని సుభాష్ ఫైర్ అవుతాడు.

మరోవైపు రుద్రాణి, రాహుల్, రేఖ మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. తాము అనుకుంది జరిగిందని సంతోషిస్తారు. నేను ఆ మినిస్టర్‌ను అడ్డు పెట్టుకుని ఇంట్లోంకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా. దానికి మీరు ఇంట్లో అందరిని మీవైపు తిప్పుకోండని ఓ ప్లాన్ చెబుతుంది రుద్రాణి. ఇక నువ్వే చూస్తావుగా అని రాహుల్ , రేఖ అంటారు.

రుద్రాణి ప్లాన్ తో ఏం జరగనుంది?

మరోవైపు స్వప్న కూతురుకు జ్వరం తగ్గకపోవడంతో కంగారుపడుతుంది. డాక్టర్ కాల్ చేసి చెప్పడంతో వెంటనే హాస్పిటల్‌కు రమ్మంటుంది. దాంతో రాహుల్‌కు కాల్ చేసి అదే విషయం చెబుతుంది స్వప్న. ఆఫీస్‌లో అర్జంట్ మీటింగ్ ఉంది, వెంటనే రాలేను, ఇంట్లో ఎవరినైనా తోడు తీసుకెళ్లి నేను వర్క్ ఫినిష్ చేసుకుని వస్తానని రాహుల్ అంటాడు. సరేనని స్వప్న అంటుంది.

రాజ్, కావ్య హాస్పిటల్‌కు వెళ్తామనుకుంటారు. స్వప్న హాస్పిటల్‌కు బయలుదేరుతుంటే సుభాష్ ఎదురై తాను వస్తానంటాడు. ఇద్దరు హాస్పిటల్‌కు వెళ్తారు. రాజ్, కావ్య కూడా వస్తారు. టెస్ట్‌లు చేయాలని డాక్టర్ పాపను తీసుకెళ్తుంది. స్వప్న చాలా కంగారుపడుతుంటే కావ్య ఓదారుస్తుంది. అప్పు కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటారు.

నిందను 24 గంటల్లో చెరిపేసుకుంటామని కావ్య చెబుతుంది. రాజ్‌తో సుభాష్ రేవతి ఇంట్లో ఉండాల్సింది కాదురా, అది కూడా మీ పిన్ని తప్పు పడుతుందని అంటాడు. పిన్ని ఎలా అనుకున్న చేసేదేం లేదు. నిజాలు బయటపడ్డాక అన్ని తెలుస్తాయి. బాధలో అలా అంటుందని, పోలీసులకు చెప్పాం. డిపార్ట్‌మెంట్ అంతా ట్రై చేస్తుందని రాజ్ అంటాడు.

అప్పు, కళ్యాణ్ ల మిస్సింగ్ మిస్టరీ!

అదే విషయం కావ్యకు చెప్పి తీసుకెళ్తాడు రాజ్. సుభాష్, స్వప్న వెళ్లిపోతారు. లొకేషన్ వెతుక్కంటూ కావ్య, రాజ్ వెళ్తారు. ఓ చోట ఆగి ఇదేనా లొకేషన్, ఎవరు లేరేంటీ అని రాజ్ డౌట్ పడతాడు. ఎస్సై కూడా వస్తాడు. ఫోన్ సిగ్నల్ ఇక్కడే కట్ అయినట్లుంది. ఇక్కడే దగ్గర్లో పెట్టి ఉంటారని ఎస్సై అంటాడు. పాడు బడ్డ ఇల్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్తారు.

ఆ ఇంట్లో ఎవరు ఉండరు. బయటకెళ్లి చూస్తే ఓ ఫోన్ దొరుకుతుంది. ఈ ఫోన్ కిడ్నాప్ వీడియో తీసినవాడిది అయి ఉంటుంది. వీడియో తీసింది కిడ్నాపర్ వ్యక్తి కాదు. వాడు కిడ్నాపర్స్‌కు దొరికిపోయి ఉంటాడు. వాడి ఫోన్ ఇక్కడ పడి ఉంటుంది. అప్పు, కల్యాణ్‌ల ప్లేస్ మార్చి ఉంటారని ఎస్సై అంటాడు.

మరోవైపు అప్పు, కల్యాణ్ తప్పించుకుంటారు. అదే విషయం రుద్రాణికి చెబుతారు. వాళ్లు తప్పించుకుంటే నేను బయటపడతాను. వాళ్లను చంపేయమని రుద్రాణి అంటుంది. అప్పును రౌడీ కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ లో రోజుకో సంచలనం. రానున్న ఎపిసోడ్స్ లో మరిన్ని ట్విస్ట్ లు ఖాయం. అప్పు కళ్యాణ్ ఎలా సేఫ్ అవుతారు? రుద్రాణి ప్లాన్ ఫలిస్తుందా? వేచి చూడండి! మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.