|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

BSNL సంచలనం! కేవలం ₹1499కే 300 రోజులు, 32GB డేటా.. ఈ ప్లాన్ మిస్ చేయొద్దు!

Published: 15-05-2026, 5:31 PM
BSNL సంచలనం! కేవలం ₹1499కే 300 రోజులు, 32GB డేటా.. ఈ ప్లాన్ మిస్ చేయొద్దు!
  • BSNL రూ. 1499 వార్షిక ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
  • ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 32GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
  • మే 17 వరకు ఈ ప్లాన్‌పై 5% తగ్గింపు అందుబాటులో ఉంది.
  • రోజుకు 100 SMS, ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త! అత్యంత చౌకైన వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 1499కే 300 రోజుల వ్యాలిడిటీ, 32GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ కొత్త ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.

BSNL కొత్త వార్షిక ప్లాన్ వివరాలు

BSNL Recharge Plan ( Image Credit : AI )

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. లక్షలాది కస్టమర్ల కోసం తక్కువ ధరలో కొత్త వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 300 రోజుల వ్యాలిడిటీ పీరియడ్‌తో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. దేశమంతటా అన్ లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1499గా ఉంది. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.

ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ

Read Also : Xiaomi 17T Series : షావోమీ లవర్స్ గెట్ రెడీ.. షావోమీ 17T, 17T ప్రో వచ్చేస్తున్నాయ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు

300 రోజుల వ్యాలిడిటీ, 32GB హై-స్పీడ్ డేటా : ఈ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దేశమంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్, అలాగే అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అదనంగా, ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్, మొత్తం 32GB హై-స్పీడ్ డేటా కూడా పొందవచ్చు.

ఇతర లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లు

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌పై మే 17వ తేదీ వరకు 5శాతం తగ్గింపు అందిస్తోంది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను రూ. 75 తక్కువకే పొందవచ్చు. మరో రెండు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. రూ. 2399 ప్లాన్ కూడా పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌పై కూడా 5శాతం తగ్గింపు పొందవచ్చు.

ఈ ప్లాన్ బెనిఫిట్స్ కోసం భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఫ్రీ SMS, 2GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.

మొత్తంమీద, BSNL యొక్క రూ. 1499 ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలతో, ఇది కస్టమర్లకు గొప్ప విలువను అందిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.