
బాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదం ఆవహించింది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ గత రాత్రి కన్నుమూశారు. అమితాబ్ బచ్చన్ తో ‘డాన్’ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన చంద్ర బారోట్ 86 ఏళ్ల వయసులో మరణించారు.
Key Points
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు.
అమితాబ్ బచ్చన్ తో 'డాన్' సినిమా ద్వారా చరిత్ర సృష్టించారు.
86 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు.
బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
డాన్ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూత
Chandra Barot : బాలీవుడ్ లో నేడు తీవ్ర విషాదం నెలకొంది. దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూశారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చంద్ర బారోట్ అమితాబ్ బచ్చన్ తో 1978 లో డాన్ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ డాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అమితాబ్ కెరీర్ లో ఒక పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.
ఇండియాలో ఆ తర్వాత వచ్చిన డాన్ సినిమాలకు చంద్ర బారోట్ తెరకెక్కించిన డాన్ సినిమానే ఒక పుస్తకంలా నిలిచింది. అప్పట్లోనే అమితాబ్ డాన్ సినిమా 7 కోట్లు కలెక్ట్ చేసింది. అమితాబ్ డాన్ తర్వాత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ డాన్ టైటిల్ తో రెండు సినిమాలు తీసాడు. దానికి మరో సీక్వెల్ త్వరలో రణవీర్ సింగ్ హీరోగా రానుంది.
అమితాబ్ బచ్చన్ తో ఆయన సినీ జర్నీ
చంద్రబారోట్ డాన్ తర్వాత ఒక రెండు సినిమాలు తీసి కనుమరుగయ్యారు. సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ 86 ఏళ్ళ వయసులో నేడు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయాన్ని చంద్ర బారోట్ భార్య దీప తెలిపారు. చంద్ర బారోట్ మృతిపై బాలీవుడ్ స్టార్స్ నివాళులు అర్పిస్తున్నారు.
బాలీవుడ్ సంతాపం
చంద్ర బారోట్ మృతితో బాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.

