
కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, ఈ సినిమా OTT డీల్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. 9 కోట్ల పైగా విలువైన డీల్ రద్దు కావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Key Points
కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'కి భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించగా, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీకి ప్రశంసలు దక్కాయి.
9 కోట్ల పైగా విలువైన OTT డీల్ ఊహించని విధంగా రద్దు కావడంతో చర్చనీయాంశమైంది.
మెరుగైన రేటు కోసం నిర్మాతల నిరీక్షణ లేదా OTT ప్లాట్‌ఫామ్‌ల అంచనాపై ఊహాగానాలు.
‘చెన్నై లవ్ స్టోరీ’కి పాజిటివ్ టాక్
Chennai Love Story OTT Deal: కిరణ్ అబ్బవరం …చిన్న సినిమాలకి పెద్ద హీరో .క,కె- ర్యాంప్ వంటి సినిమాలు సాలిడ్ సక్సెస్ చూడటంతో ఈ కుర్ర హీరో రేంజ్ హీరో ఎక్కడికో వెళ్ళిపోయింది.ఇక తాజాగా బేబీ,కలర్ ఫోటో వంటి సినిమాలకి కథ అందించిన సాయి రాజేష్ మరోసారి అందించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాలో హీరోగా వస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఇక దీన్ని రవి వర్మ నంబూరి దర్శకత్వంలో skn నిర్మాతగా,మణి శర్మ సంగీతం అందిస్తుండటంతో ఆడియన్స్ లో సినిమాని చూసేయాలన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్
సినిమా వదిలిన ట్రైలర్ టీజర్ సాంగ్స్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లవ్ స్టోరీస్ ని ఇష్టపడే ప్రేక్షకులు అసలు ఈ సినిమాలో ఏముంటుందో అన్న ఆసక్తిని చూపించారు .ఇక తాజాగా ఈరోజే సినిమా రిలీజ్ కావడం ,సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కిరణ్ అబ్బవరం,గౌరీ ప్రియ మధ్య ఎమోషన్స్ బాగున్నాయని వాళ్ళు మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదే ఓటీటీ డీల్ .
ఓటీటీ రైట్స్ 9 కోట్ల పైగా
9 కోట్ల OTT డీల్ రద్దు: అసలు కారణం ఏంటి?
అవును మామూలుగా ఈరోజుల్లో చాలా సినిమాలు రిలీజ్ లోకి ముందే ఓటీడీలు కుదుర్చుకుంటాయి కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా మాత్రం ఇంకా ఓటీటీ డీల్ ఫైనల్ కాలేదన్న అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు బిజినెస్ మాత్రం బాగానే జరిగిందట.ఓటీటీ రైట్స్ 9 కోట్ల పైగా జరిగిందని కానీ ఊహించని విధంగా ఆ డీల్ క్యాన్సిల్ అయిందని వినిపించింది.
మరి మంచి బజ్ వచ్చినప్పటికీ సినిమా బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఓటీటీ డీల్ ఎందుకు కుదరలేదు అన్న అనుమానం వస్తుంది. మామూలుగా సినిమా థియేటర్లలో బాగా ఆడితే ఇంకా మంచి రేట్ వస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు వెయిట్ చేస్తున్నారన్న మాట ఒకవైపు వినిపిస్తుండగా, మరోవైపు కలెక్షన్స్,ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తరువాతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఫైనల్ డెసిషన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఏది ఏమైనా సినిమా టేబుల్ ప్రాఫిట్ లోనే
నిర్మాతలు, OTT ప్లాట్‌ఫామ్‌ల వ్యూహాలు
ఇక ఈ సినిమాకి ఆడియో రైట్స్ దాదాపు రెండు కోట్ల 30 లక్షలకి వెళ్లాయని , అలాగే నైజాం ఏరియాలో ఏకంగా ఏడు కోట్ల రేటు పలికితే సీడెడ్ లో మూడు కోట్ల వరకు అమ్ముడైందని టాక్ వినిపిస్తుంది. ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా పైగానే అమ్ముడయ్యాయట అయితే ఇవి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కాదు ట్రేడ్ సర్కిల్ లో వినిపిస్తున్న న్యూస్ మాత్రమే కానీ .ఏది ఏమైనా సినిమా టేబుల్ ప్రాఫిట్ లోనే బయటపడ్డట్టు కనిపిస్తుంది.
అయితే ఇలాగే గతంలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మంచి రేట్లు దక్కించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా బేబీ సినిమాకే వస్తే థియేటర్లలో బ్లాక్ బస్టర్ కావడంతో ఓటీటీ రైట్స్ కూడా సాలిడ్ గానే పలికాయి.ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా అదే మ్యాజిక్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
మరి థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి త్వరలో భారీ ఓటీడీలు కుదురుతుందా లేక ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తుందా అన్నది కాలమే డిసైడ్ చేయాలి .ఏదేమైనా ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ ఓటీప ఓటిపి డీల్ సస్పెన్స్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
‘చెన్నై లవ్ స్టోరీ’కి మంచి బజ్ ఉన్నప్పటికీ, OTT డీల్ రద్దు వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. నిర్మాతలు, OTT ప్లాట్‌ఫామ్‌ల మధ్య జరుగుతున్న ఈ వ్యూహాత్మక ఆట త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఆశిద్దాం.


