|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛత్తీస్‌గఢ్‌లో భీకర ఎన్‌కౌంటర్: మావోయిస్టుల గుండెల్లో రైళ్లు.. భారీగా హతం?

Published: 12-03-2026, 6:35 AM
  • ఛత్తీస్‌గఢ్‌లోని కోయిల్ బేడలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
  • మావోయిస్టులున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి.
  • భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు.
  • కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టు సాహిత్యం, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్ కోయిల్ బేడ ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఆపరేషన్ కగార్ (Operation Kagar) ఎఫెక్టుతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‍గఢ్ (Chhattisgarh) నార్త్ బస్తర్ కోయిల్ బేడలో భద్రతా దళాలలు, మావోయిస్టులో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. బలగాలు అనుమానిత ప్రదేశాన్ని చుట్టుముట్టగానే మావోయిస్టులు ముందుకు వస్తున్న దళాలపై కాల్పులు జరిపాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి.

కూంబింగ్ ఆపరేషన్‌లో కాల్పులు

ఈ క్రమంలో చీకటి పడటంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోపలికి పారిపోయినట్లు ఎస్పీ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టు సాహిత్యం, మావోయిస్టులు వదిలి వెళ్లిన రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు.

మావోయిస్టుల వస్తువులు స్వాధీనం

అయితే ఈ కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందినట్లు పలు న్యూస్ చానల్స్ రిపోర్టు చేస్తున్నాయి. దీంతో ఈ కాల్పులు ముగిసే సమయానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కాల్పుల నేపథ్యంలో చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయని, పారిపోతున్న మావోయిస్టులను పట్టుకోవడానికి అదనపు బృందాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు దిగ్బంధనాలను బలోపేతం చేశాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్ ఫలితంగా మావోయిస్టు ఉద్యమంపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.