|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘చిరంజీవ’ కోసం ఎంతగానో కష్టపడ్డాడు.. హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు..

Published: 05-11-2025, 1:03 PM
‘చిరంజీవ’ కోసం ఎంతగానో కష్టపడ్డాడు.. హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు..

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ చిత్రం ‘చిరంజీవ’ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో దర్శకుడు అభినయ కృష్ణ కృషిని రాజ్ తరుణ్, అనిల్ రావిపూడి ఎంతగానో ప్రశంసించారు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అర్హుడని పేర్కొన్నారు.

Key Points

1

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ చిత్రం ‘చిరంజీవ’.

2

ఈ నెల 7వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ‘చిరంజీవ’ స్ట్రీమింగ్.

4

అనిల్ రావిపూడి ప్రెస్ మీట్‌కు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘చిరంజీవ’ ఓటీటీ రిలీజ్ వివరాలు

రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’(Chiranjeeva). ఈ చిత్రంలో కుషిత కల్లపు (Kushita Kallapu)హీరోయిన్‌గా నటించగా.. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించగా.. ఈ నెల 7వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్‌లో నేను చేసిన ‘ఒరేయ్ బుజ్జి’గా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.

దర్శకుడి కష్టంపై రాజ్ తరుణ్ ప్రశంసలు

ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న ప్రీమియర్ కాబోతోంది. ఆహా సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. దీని కోసం అందరం కష్టపడతాం. కానీ అభి డైరెక్టర్‌గా మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ..ఇలా మంచి కోస్టార్స్ నటించారు. వాళ్లందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘చిరంజీవ మూవీ కాన్సెప్ట్ గురించి అభి చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

అనిల్ రావిపూడి శుభాకాంక్షలు

అభి నాకు గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమా టైమ్ నుంచి తెలుసు. ఇందులో మంచి రోల్ చేశాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ మూవీ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. యాక్టర్స్‌ను బాగా ఇమిటేట్ చేస్తుంటాడు. ‘కందిరీగ’ సినిమాకు తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి హెల్ప్ చేశాడు. అదిరే అభిగా జబర్దస్త్‌తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. రాజ్ తరుణ్‌కు కూడా ఈ సినిమా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నా. చిరంజీవ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మొత్తానికి, ‘చిరంజీవ’ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది. ముఖ్యంగా దర్శకుడి కృషి, రాజ్ తరుణ్ కమ్ బ్యాక్‌పై అందరిలోనూ ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.