
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది.
- సినిమా విడుదల ముందే డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి.
- చిరంజీవి నటన, అనిల్ రావిపూడి ప్లానింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. సినిమా డిజిటల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.
జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల
Mana Shankara Vara Prasad Garu digital rights deal: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం వల్ల మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ రావిపూడి ఎంటర్టైనింగ్ స్టోరీ టెల్లింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ తో సినిమా తీయడంలో దత్త. అదే ఫార్ములాను ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. అవసరం ఆయన ఎలిమెంట్స్ లేకుండా కథకి తగ్గట్టుగా సినిమా తీసాడని సమాచారం.
అన్నిటికంటే ఎక్కువగా అనిల్ రావిపూడి బడ్జెట్ విషయంలో చాలా సెన్సిబుల్‌గా ఉంటారని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సినిమాను చాలా తక్కువ టైమ్‌లో పూర్తి చేయడం మరో ప్లస్ పాయింట్. షూటింగ్ లో డిలే లేకుండా, ఖర్చులు పెరగకుండా మొత్తం ప్రాజెక్ట్‌ని కంట్రోల్‌లో ఉంచాడు అనిల్ రావిపూడి. దానికి ఫలితం సినిమా రిలీజ్ కాకముందే డిజిటల్ రైట్స్‌కు రికార్డ్ రేంజ్‌లో డీల్ కుదిరడం అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవిని అభిమానులకు నచ్చేలాగా మాస్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయని సమాచారం.
రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్
ది రాజా సాబ్ విషయంలో జరిగిన తప్పులు చూసి ఇప్పుడు ఫ్యాన్స్ అనిల్ రావిపూడి ని చూసి మారుతి చాలా నేర్చుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. మారుతి అవసరం లేని ఫ్యాన్సీ ఐడియాల వైపు వెళ్లి డబ్బులు వెస్ట్ చేశాడు అని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో క్లారిటీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనిల్ రావిపూడి మాత్రం తెలివిగా సేఫ్ గేమ్ ఆడాడు అని.. ఫ్యాన్స్‌కి ఏం కావాలో అదే తీశాడు అని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పెద్ద పెద్ద ప్రయోగాలు లేకుండా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసిన సినిమా అని టాక్. మరి జనవరి 12న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సినిమా కంటే ముందే అనిల్ రావిపూడి ప్లానింగ్ విషయంలో మాత్రం అందరూ ఫిదా అయిపోయారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంపై ప్రశంసలు
చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కూడా మరీ ఓవర్ గా లేకుండా సహజంగా ఉంచడం కూడా సినిమాకి బాగా ప్లస్ అవుతుందట. ఇక నటీనటుల విషయానికి వస్తే… చిరంజీవితో పాటు వెంకటేష్, నయనతార కీలక పాత్రల్లో నటించారు. ఈ కాంబినేషన్ కూడా సినిమాకు మంచి హైప్ తెచ్చింది. కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం లాంటి నటులు సపోర్టింగ్ క్యాస్ట్‌గా కనిపించనున్నారు. కామెడీ టైమింగ్‌లో వీళ్ళందరూ కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారని చెప్పుకోవచ్చు.
మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా భారీ అంచనాలతో విడుదలవుతోంది. అనిల్ రావిపూడి ప్లానింగ్, చిరంజీవి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. జనవరి 12న సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.


