|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి మాస్ ట్రీట్: డైరెక్టర్ కోసం కొరియోగ్రాఫర్‌గా మారిన మెగాస్టార్!

Updated: 13-01-2026, 9:52 PM
చిరంజీవి మాస్ ట్రీట్: డైరెక్టర్ కోసం కొరియోగ్రాఫర్‌గా మారిన మెగాస్టార్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు!
  • క్లైమాక్స్‌ సాంగ్‌లో అనిల్ రావిపూడికి చిరు కొరియోగ్రఫీ అందించడం విశేషం.
  • ఈ మూవీ 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా.
  • వెంకటేష్ గెస్ట్ రోల్ మరియు చిరంజీవి మాస్ స్టెప్పులు హైలైట్!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అభిమానులకు పండగ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ కోసం చిరు కొరియోగ్రఫీ సంచలనం!

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్‌ అందుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ కీలక పాత్రలో గెస్ట్ గా మెరిశారు. సుస్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. ఈ నెల 12న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇప్పుడు బ్లాక్‌ బస్టర్ టాక్‌తో రన్‌ అవుతుంది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో బ్లాక్‌ బస్టర్‌ మీట్‌ పేరుతో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడిని అందరు ప్రశంసించారు. అద్భుతమైన దర్శకుడు అంటూ వెల్లడించారు. చిరంజీవిని కొనియాడారు. సినిమా వేరే స్థాయిలో వెళ్తుందని, కలెక్షన్ల పరంగా ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలియదంటున్నారు. నిర్మాత సాహు గారపాటి మాత్రం నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్లని ఆశిస్తున్నట్టు తెలిపారు. సినిమా కోసం చిరంజీవి ప్రాణం పెట్టారని తెలిపారు. ఈ క్రమంలో ఈ మూవీతో చిరు టెక్నీషియన్ గా మారిన విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ విషయాన్ని పంచుకున్నారు.

బ్లాక్ బస్టర్ మీట్‌లో మెగాస్టార్ కామెంట్స్ వైరల్!

సినిమాలో క్లైమాక్స్ లో చిరంజీవి, వెంకటేష్‌లతో సాంగ్‌ ఉంటుంది. ఇందులో చిరు, వెంకీ ఇరగదీశారు. మాస్‌ ఆడియెన్స్ చేత థియేటర్లలో డాన్సులు వేయిస్తున్నారు. అయితే ఈ పాటలో దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా కాసేపు కనిపించారు. ఈ ఇద్దరు బిగ్‌ స్టార్స్ తో తెరని పంచుకోవాలనేది తన కోరిక అని, అందుకే ఈ పాటలో తాను కనిపించినట్టు తెలిపారు. కనిపించడమే కాదు, డాన్సులు కూడా చేశాడు. ఇద్దరి సినిమాల పాటలకు ఆయన స్టెప్పులేయడం విశేషం.

400 కోట్ల కలెక్షన్స్‌పై నిర్మాత ఆశాభావం!

అయితే తాను ఈ పాటలో డాన్స్ చేయాలని భావించినప్పుడు చిరంజీవి, వెంకటేష్‌ ఒక్క లుక్‌ ఇలా చూశారట. ఆ తర్వాత అనిల్‌ రావిపూడికి చిరంజీవినే కొరియోగ్రఫీ చేశారట. ఎలా స్టెప్పులేయాలో నేర్పించాడట. స్టెప్‌ సరిగా రాకపోతే వేసి చూపించాడట. తన సినిమాలో, పైగా తన పాత పాటకి స్టెప్పులంటే పర్‌ఫెక్షన్‌గా ఉండాలని చెప్పి అనిల్‌ కోసం కొరియోగ్రఫీగా మారిపోయారట. ఈ విషయాన్ని అనిల్‌ పంచుకున్నారు. అయితే ఇది తనకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌ మెంట్‌ అన్నారు. అంతేకాదు సినిమాకి హిట్‌ టాక్‌ వచ్చినప్పుడు ఆయన్ని కలిస్తే ఎంతగానో అభినందించారట. ముఖాన్ని పట్టుకుని క్యూట్‌గా ఇలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారని, అదే పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్టు తెలిపారు అనిల్‌ రావిపూడి.

చిరంజీవి కొరియోగ్రాఫర్‌గా మారడం, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.