|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ సినిమా చూసి చిరంజీవి ఊగిపోయారు! వీడియో దుమ్మురేపుతోంది!

Published: 21-03-2026, 8:05 AM
  • చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూస్తూ డ్యాన్స్ చేశారు.
  • చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని పాట సన్నివేశంలో రాగానే ఎంతో ఆనందించారు.
  • ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ భార్య కూడా పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు చూపించారు.
  • మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుబంధం మరోసారి వైరల్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చూస్తూ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదమ్ముల అనుబంధానికి ఇది మరో నిదర్శనం.

చిరంజీవి డ్యాన్స్ వీడియో వైరల్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan)ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆశ్చర్యపరిచిన అన్నదమ్ముల అనుబంధం వారిది. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఇంటికి తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి.. కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో చూసి అందరి కళ్లు చెమర్చాయి. దీనిపై నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా వారిద్దరిని అభినందించిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మరోసారి అలాంటి ఘటన అని చెప్పలేం కానీ, ఈసారి చిరంజీవి తన తమ్ముడి విషయంలో తన ప్రేమను కనబరిచారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తన తమ్ముడు అండ్ ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చిరంజీవి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తన సీట్లో కూర్చొనే.. సినిమాలో పాటలు వచ్చినప్పుడు ఆటోమ్యాటిగ్గా రిథమింగ్ ఇస్తున్నారు. డ్యాన్స్ అంటే చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అందరికీ ఎంతో ఇష్టమైన ‘ఈ మనసై’ పాట సరికొత్తగా తెరపై కనిపిస్తుంది. ఇక డ్యాన్స్ చేయకుండా ఉంటారా?

‘ఉస్తాద్’ సినిమాపై చిరంజీవి రియాక్షన్

Megastar @KChiruTweets Garu watched #UstaadBhagatSingh with his family and thoroughly enjoyed it ❤️

He loved every moment of the film and appreciated the efforts of the entire team ❤‍🔥

Don’t miss his reaction for Vaana Vaana Velluvaaye & EE Manase songs 😍

పవన్ కళ్యాణ్, చిరంజీవి అనుబంధం

Watch… pic.twitter.com/GYB0cBOcKn

— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2026

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల అనుబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో మెగా అభిమానులకు కన్నుల పండుగలా ఉండటంతో తెగ వైరల్ చేస్తున్నారు. వారి అభిమానం వెలకట్టలేనిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.