|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే! బాబాయ్‌ ప్లేస్‌లో కోడలు.. చిరంజీవి కూతురి సంచలన నిర్ణయం!

Published: 13-03-2026, 7:05 AM
మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే! బాబాయ్‌ ప్లేస్‌లో కోడలు.. చిరంజీవి కూతురి సంచలన నిర్ణయం!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది!
  • నిర్మాతగా సుస్మిత కొణిదెల తొలి ప్రయత్నంలోనే భారీ విజయం, తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.
  • నాగబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇకపై అభిమానుల బాధ్యతను సుస్మిత కొణిదెల తీసుకుంటారని ప్రకటన.
  • చిరంజీవి, అభిమానుల మధ్య వారధిగా సుస్మిత.. తండ్రి బాటలో తనయ!

మెగాస్టార్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త! చిరంజీవి గారి కుమార్తె సుస్మిత కొణిదెల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మన శంకర వరప్రసాద్ గారు: భారీ విజయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన చివరి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక రీజినల్ మూవీ ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం సంచలనమే అని చెప్పాలి. ఏకంగా ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, సాహు గారపాటి కలసి నిర్మించారు. నిర్మాతగా సుస్మిత కొణిదెల ఈ చిత్రంతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో తన బాధ్యత ఇంకా పెరిగింది అని సుస్మిత పేర్కొంది. ఇటీవల 50 రోజులు ఆడిన సినిమాలు చాలా రేర్. కానీ మన శంకర వరప్రసాద్ గారు ఆ ఫీట్ సాధించింది. దీనితో నాన్నగారి గత సినిమాలు, పథ అనుభవాలు మొత్తం గుర్తుకు వచ్చాయి.

నాగబాబు బాధ్యతలను తీసుకున్న సుస్మిత

ఈ సినిమా ప్రచారం కోసం అభిమానులని కలుసుకున్నాను. అది సరికొత్త అనుభూతి. నాన్న గారు అభిమానుల విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. చిరంజీవి గారికి, అభిమానులకు మధ్య డైరెక్ట్ గా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది.

కానీ ప్రతిసారి నాన్నగారు అభిమానులకు డైరెక్ట్ గా కలుసుకోవడం కుదరదు. కానీ బాబాయ్ నాగబాబు గారు చిరంజీవి గారికి, అభిమానులకు మధ్య ఒక వారధిలా ఉన్నారు. చాలా ఏళ్లుగా నాగబాబు గారు ఆ పని చేశారు. ఇకపై ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని సుస్మిత కొణిదెల తెలిపారు.

మెగా అభిమానులకు ఇకపై సుస్మిత అండ

చిరంజీవి గారి అభిమానులు, చరణ్ అభిమానులు ఎవరి అభిమనులు అయినా సరే నేను వారధిలా ఉంటా అని సుస్మిత పేర్కొంది. నాగబాబు గారు ప్రస్తుతం జనసేన పార్టీ, రాజకీయాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇకపై ఆయన చేసే పని నేను చేస్తా అని సుస్మిత పేర్కొంది.

సుస్మిత కొణిదెల తీసుకున్న ఈ నిర్ణయం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.