
📌 Key Points
- సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- భార్య సురేఖే తన విజయానికి కారణమని చిరంజీవి ప్రకటన
- 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది
- సురేఖ కుటుంబానికి వెన్నెముకగా నిలిచిందని చిరంజీవి ప్రశంస
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సక్సెస్‌కు కారణం సురేఖే అని చెప్పడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
సురేఖ పుట్టినరోజు వేడుకలో చిరు
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన భార్యని ఉద్దేశించి చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఆమెకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. అయితే ఇందులో భార్య తన జర్నీలో ఎంతటి కీలక పాత్ర పోషించిందనేది వెల్లడించారు చిరంజీవి. ఆమె వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నట్టు వెల్లడించారు. తాను వర్క్ పై దృష్టి పెట్టడం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉందని, కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకుందని తెలిపారు.
ఫ్యామిలీలో కలిసిపోవడమే కాదు, బాధ్యతలు తీసుకుందని, కోడలుగా కాకుండా కూతురిలా తమ పేరెంట్స్ ని చూసుకుందని వెల్లడించారు. ఆమె తన బలమని ప్రకటించారు చిరంజీవి. ఆయన చెబుతూ, `ఫిబ్రవరి 20, 1980న మేము వివాహం చేసుకున్న రోజు నుండి నువ్వే నా గొప్ప బలం. ఈ రోజు నీ పుట్టిన రోజును, అలాగే ముందుగానే మన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
`నువ్వు మన కుటుంబానికి కేంద్రకం, మా అందరినీ ప్రేమతో బంధించే వ్యక్తివి నువ్వు. నా కుటుంబాన్ని ఆలింగనం చేసుకున్నావు, ప్రతి క్షణంలో వారికి అండగా నిలిచావు. నా తల్లిదండ్రులు నిన్ను సమానమైన ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నట్లే, వారికి నిజమైన కుమార్తె అనిపించుకున్నావు. వారిని అంతే బాగా చూసుకుంటున్నావు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే, అది నా ప్రతిభ, కృషి కాదు, “అది నువ్వే”. నువ్వు ప్రతి బాధ్యతను ప్రశాంతంగా నిర్వర్తించడం వల్లే నేను పూర్తిగా నా కెరీర్‌పై దృష్టి పెట్టగలిగాను. ప్రతి సంక్షోభంలో, ప్రతి వేడుకలో, మమ్మల్ని కలిపి ఉంచేది నువ్వే. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నువ్వే నా బలం, నా సపోర్టింగ్ సిస్టమ్, నా శాంతి.
భార్య సపోర్ట్‌పై చిరంజీవి కామెంట్స్
ఈరోజు నీ పుట్టినరోజు త్వరలో మన వివాహ వార్షికోత్సవాన్ని సమీపిస్తున్న తరుణంలో, నేను నా హృదయం నుండి చెప్పాలనుకుంటున్నాను.. నేను మీ వల్లనే ఉన్నాను. నా ప్రేమతో ఎల్లప్పుడూ, ఎప్పటికీ.. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకి జన్మదిన శుభాకాంక్షలు` అని తెలిపారు చిరంజీవి. మొత్తంగా తన క్రెడిట్ మొత్తం భార్య సురేఖకి ఇచ్చేశారు చిరంజీవి. అంతేకాదు తన ప్రతి పదంలో ఆమె బాధ్యతని, ఆమెపై తనకున్న ప్రేమని తెలియజేశారు . ఎమోషనల్‌గా ఈ పోస్ట్ పెట్టారు చిరు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️ Happy Birthday to dearest Surekha. From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK
వైరల్ అవుతున్న మెగాస్టార్ పోస్ట్
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026
చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. `సంక్రాంతికి వస్తున్నాం`, `ఓజీ` వంటి చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో చిరంజీవి తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి చూపించారు. ప్రస్తుతం ఆయన బాబీతో సినిమాకి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో దీన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. వీటితోపాటు ఇప్పటికే నటించిన `విశ్వంభర` మూవీ జులైలో విడుదల కాబోతుంది.
చిరంజీవి తన భార్యపై చూపించిన ప్రేమ, అభిమానం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


