|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ ఎమోషనల్ బ్లాస్ట్! ఎన్టీఆర్ గురించి చిరు సంచలన పోస్ట్.. వైరల్!

Published: 20-03-2026, 4:05 AM
మెగాస్టార్ ఎమోషనల్ బ్లాస్ట్! ఎన్టీఆర్ గురించి చిరు సంచలన పోస్ట్.. వైరల్!
  • మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రదానం, అభిమానుల్లో ఆనందం!
  • నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాకు చిరంజీవి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు
  • ఎన్టీఆర్ కళల సమ్మేళనమని, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేమని చిరంజీవి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
  • `తిరుగులేని మనిషి` చిత్రంలో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించారు, అప్పటి సంగతులను గుర్తు చేసుకున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ గురించి చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది! ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరు ఎమోషనల్ కామెంట్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

మెగాస్టార్‌ చిరంజీవికి ప్రస్టీజియస్‌ ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డుని అందించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమాకి చేస్తున్న సేవలకుగానూ చిరంజీవికి `ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు`ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఉగాది పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో చిరంజీవితోపాటు, కమల్‌ హాసన్‌, నాగార్జున, అమల, మాధురీ దీక్షిత్‌, నాగచైతన్య, రష్మిక మందన్నా వంటి అవార్డు విన్నర్స్, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు సినిమా అభివృద్ధికి సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న సేవాలని ప్రశంసించారు.

తాజాగా చిరంజీవి.. ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. `చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు. తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకు తీసుకొని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్‌ అంటే.. N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా, ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న `ఎన్టీఆర్ నేషనల్ అవార్డు` నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను` అని తెలిపారు చిరంజీవి.

ఎన్టీఆర్ గురించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం చిరంజీవి పోస్ట్ వైరల్‌ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ `తిరుగులేని మనిషి` అనే చిత్రంలో కలిసి నటించారు. ఇందులో ఎన్టీఆర్‌ హీరో కాగా, చిరంజీవి కీలక పాత్రలో నటించారు. 1981లో ఈ మూవీ విడుదలైంది. డీసెంట్‌గా ఆడింది. అయితే అప్పటికీ చిరుకి బ్రేక్‌ రాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్లారు. చిరంజీవి ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ సినిమాల్లో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత మెగాస్టార్‌ అయ్యారు.

చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం

ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో సందడి చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేసిన ఈ మూవీ పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా చిత్రాలు కాకుండా, రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో బ్లాక్‌ బస్టర్‌ `వాల్తేర్‌ వీరయ్య` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు చిరు.. శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. `పారడైజ్‌` రిలీజ్‌ తర్వాత ఈ చిత్రం స్టార్ట్ కానుంది.

చిరంజీవి ఎన్టీఆర్ గురించి చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.