|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మనవళ్లు పేర్ల మాస్టర్ ప్లాన్ లీక్! అర్ధాలు తెలిస్తే షాక్ అవుతారు!

Published: 13-02-2026, 5:05 AM
  • మెగాస్టార్ మనవడు శివరామ్ పేరులో శివశంకర వరప్రసాద్, రామ్ చరణ్ పేర్ల కలయిక!
  • అనిర్వా దేవి పేరు.. కనకదుర్గా దేవి శక్తి స్వరూపంగా, అంజనా దేవి పేరులోని భాగం!
  • చిరంజీవి మనవరాలి పేరును లలిత సహస్రనామం నుండి స్వీకరించినట్టు ప్రకటన!
  • ఫోటోలో మెగా ఫ్యామిలీ సంబరాలు! క్లీంకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెగా అభిమానులకు పండగే పండగ! రామ్ చరణ్, ఉపాసనల కవల పిల్లల పేర్లను చిరంజీవి స్వయంగా వెల్లడించడంతో ఆనందం రెట్టింపు అయింది. ఈ పేర్ల వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

శివరామ్ పేరు వెనుక చిరంజీవి సీక్రెట్ ఏమిటి?

జనవరి 31న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టగా.. రీసెంట్ గా వారికి నామకరణం వేడుక జరిగింది. ఆ నామకరం ఫోటోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా పేజ్ లో అభిమానులకు షేర్ చేశారు. అంతే కాదు మనవడు, మనవరాలు పేర్లను కూడా ఆయన వెల్లడించారు. వారసుడి పేరును శివరామ్ గా, మనవరాలి పేరును అనిర్వా దేవి అని పెట్టినట్టు మెగాస్టార్ వెల్లడించారు వాటికి అర్ధాలను కూడా ఆయన వివరంగా రాసుకోచ్చారు.

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

అనిర్వా దేవి పేరులో అమ్మవారి కరుణా కటాక్షాలు!

రామ్ చరణ్ కొడుకు.. మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడికి శివరామ్ అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరైన శివ శంకర వరప్రసాద్ లో శివ ను, రామ్ చరణ్ లోని రామ్ ను కలుపుకుని శివరామ్ అనే పేరును పెట్టినట్టు తెలుస్తోంది. అంతర్గత బలం, ఆధ్యాత్మిక లోతు, నిశ్చలతను ప్రతిబింబించేలా ఈ పేరును పెట్టినట్టు చిరంజీవి తన పోస్ట్ లో వెల్లడించారు.

ఇక కవల పిల్లలో ఒకరైన పాపకు అన్విరా దేవి అని నామకరణం చేశారు. అమ్మవారి ప్రతిరూపంగా ఈపేరును పెట్టినట్టు చిరంజీవి వెల్లడించారు. కనకదుర్గా దేవి శక్తి ప్రతిబింబించేలా.. ఆమె కరుణ, కృప, ధైర్యం, అచంచలమైన బలం కలిసి వచ్చేలా , శక్తి స్వరూపిణి ఆశ్విర్వాదాలు అందేలా పాపకు అనిర్వా దేవి అని పేరు పెట్టినట్టు చిరంజీవి పోస్ట్ ద్వారా తెలిపారు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పేరు కూడా కలిసేలా పాప పేరు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు క్లింకార పేరు కూడా లలిత సహస్రనామంలోనించి తీసుకుని పెట్టినట్టు చిరంజీవి చెప్పారు.

పేర్ల వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి వైరల్!

చిరంజీవి షేర్ చేసిన ఫొటోలో ఫ్యామిలీ అంతా మురిసిపోతూ కనిపించారు. మెగాస్టార్ ఒక బేబీని ఎత్తుకుని సంతోషంగా కనిపించారు. మరోక పాపను ఉపాసన తల్లి ఎత్తుకుని కనిపించారు. మరోపక్క పెద్ద పాప క్లీంకార రామ్ చరణ్ ఒడిలో కూర్చుంది. పట్టు పరికిణీలో మెరిసిపోయింది. ఆమె ఫేస్ కనిపించకుండా బ్లర్ చేశారు. ఇక పిల్లల పేర్లు అనౌన్స్ చేస్తున్నట్టుగా ఉపాసన చేతిలో మైక్ ఉంది. ఇక ఇదంతా చూస్తున్న చిరు సతీమణి సురేఖ కూడా మురిసిపోతూ కనిపించారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు కూడా ఈ పిక్ ను షేర్ చేస్తున్నారు.

చిరంజీవి మనవడు, మనవరాలి పేర్ల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి కదా. మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.