|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

400 కోట్ల బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న చిరంజీవి హీరోయిన్ ?

Published: 01-07-2025, 10:19 AM
400 కోట్ల బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న చిరంజీవి హీరోయిన్ ?

టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నయనతార 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాను వదులుకున్నారు.

2

400 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారు.

4

జవాన్ సినిమాతో షారుక్ ఖాన్ తో కలిసి నటించి విజయం సాధించారు.

నయనతార చేసిన ఆశ్చర్యకర నిర్ణయం

చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎక్స్ ఫోసింగ్ నమ్ముకొని సక్సెస్ అయితే… మరికొంతమంది తమ టాలెంట్ నమ్ముకుని హిట్ అవుతున్నారు. అలాంటి వారిలో నయనతార ( Nayanatara)ఒకరు. పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా.. దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్.. తీసుకుంటున్నారు నయనతార.

‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాను వదులుకోవడం

అయితే అలాంటి నయనతార.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాను (Chennai Express) ఆ కాలంలోనే వదులుకున్నారు. 2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో షారుక్ ఖాన్ ( Shah Rukh Khan) అలాగే దీపికా (Deepika Padukone ) నటించి మెప్పించారు. అయితే అలాంటి సినిమాను.. హీరోయిన్ నయనతార రిజెక్ట్ చేశారట. కొన్ని అనివార్య కారణాలవల్ల… నయనతార రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

చిరంజీవి సినిమాలో నయనతార

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉండగా 2023లో జవాన్… సినిమాలో భాగంగా షారుఖ్ ఖాన్ తో నయనతార నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ అయింది. కాగా ప్రస్తుతం హీరోయిన్ నయనతార.. చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు అనిల్ రావుపూడి.. దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇందులో నయనతారను ఏరి కోరి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

చివరగా, నయనతార తీసుకున్న నిర్ణయం ఆమెకు కొంత నష్టాన్ని కలిగించినప్పటికీ, ప్రస్తుతం ఆమె విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తుంది. చిరంజీవి సినిమా ఆమె కెరీర్‌కు మరింత వెలుగునిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.