
మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘మెగా-157’ చిత్రం గురించి తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. డైరెక్టర్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాయి.
Key Points
చిరంజీవి 'మెగా-157'లో శంకర వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ కామెడీ సినిమాలో నయనతార హీరోయిన్.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మెగా ఫ్యాన్స్ చిరంజీవి కొత్త రూపాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి కొత్త పాత్ర వివరాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా-157’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్యన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati), చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.
అనిల్ రావిపూడి కామెంట్స్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ..‘ఎప్పటినుంచే ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి ఎంటర్‌టైన్‌ను ఇస్తుంది. అలాగే అందరికీ ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది. ఓన్లీ కామెడీనే కాకుండా చిరంజీవిని ప్రజెన్స్ చేసే విధానం, ఎమోషనల్ డ్రామా అన్నీ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది.
మెగా ఫ్యాన్స్ ఆనందం
అలాగే పండుగకు వస్తుంది కాబట్టి మంచి టైటిల్ రా అనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో చిరు ట్రాన్స్‌ఫార్మర్ టు శంకర వరప్రసాద్‌గా కంప్లీట్‌గా కనిపించనున్నాడు. కాబట్టి శంకర్ వరప్రసాద్ ఏంటి అనేది మీరు థియేటర్లలో చూడండి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Link
చిరంజీవి అభిమానులకు ‘మెగా-157’ సినిమా పండగలాంటిది కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని ఆశిద్దాం.


