
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ ఫైనల్ కలెక్షన్లు: బాక్సాఫీస్ వద్ద రూ.305 కోట్లు వసూలు!!
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
- ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా షేర్ రాబట్టి, టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది.
- ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. అక్కడ కూడా రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఫైనల్ కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
MSG ఫైనల్ కలెక్షన్ల సునామీ!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `మన శంకర వర ప్రసాద్ గారు`. హిట్ మెషిన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఆడియెన్స్ బండ్లు, ట్రాక్టర్లు కట్టుకొని మరీ వచ్చారు. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు కదిలాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. దీంతో రీజినల్ ఫిల్మ్ లో ఇది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది.
చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదలయ్యింది. ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు రూ.84కోట్లు వసూలు చేసింది. సీనియర్లలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా నిలిచారు చిరు. ఆ తర్వాత వసూళ్ల వేట కొనసాగింది.
చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్!
దాదాపు నెల రోజుల పాటు ఈ మూవీ మంచి వసూళ్లని రాబట్టింది. యాభై రోజులపాటు థియేటర్లలో రన్ అయ్యింది. రోజుకి ఇరవై ముప్పై లక్షలు వసూలు చేసింది. 50 రోజుల వరకు సత్తా చాటిన ఈ సినిమా తర్వాత పూర్తిగా డల్ అయ్యింది. రోజుకి లక్ష వరకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో 57రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ.304-305కోట్లు వసూలు చేసింది. ప్రముఖ బాక్సాఫీసు సైట్ ప్రకారం ఈ మూవీ ఈ వసూళ్లని రాబట్టింది. దాదాపు రూ.220కోట్ల ఇండియా నెట్, రూ.43కోట్లు ఓవర్సీస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.180కోట్లకుపైగానే షేర్ వచ్చినట్టు సమాచారం.
రికార్డులు బ్రేక్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు!
సినిమాకి రూ.120కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. దాదాపు రూ.70కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రం ఇప్పుడు `జీ 5` ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అందులోనూ మంచి వ్యూస్ సాధించింది. మొదటి వారంలో టాప్‌లో ఉంది. ఇప్పుడు కూడా మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. నిన్నటి వరకు థియేటర్లలో రన్ అయిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో కూడా క్లోజ్ అయ్యింది. ఓటీటీలోనే దీన్ని చూడొచ్చు.
చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం భారీ విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


