
📌 Key Points
- చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు 21 రోజుల్లో రూ.289 కోట్ల భారీ వసూళ్లు నమోదు!
- భారత్ లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రూ.208 కోట్ల నెట్ కలెక్షన్లు కొల్లగొట్టింది.
- ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఏకంగా రూ.3 కోట్ల వసూళ్లు రాబట్టిన మన శంకర వర ప్రసాద్ గారు.
- `హనుమాన్` మూవీ రికార్డును బ్రేక్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు.. ఇప్పుడు నెంబర్ వన్ స్థానం!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాటి నుండి రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం, 21 రోజుల్లో ఊహించని కలెక్షన్లు రాబట్టింది. సంక్రాంతికి పండగ చేసుకుంటున్నారు మెగా అభిమానులు.
సండే పూట సడెన్ జంప్.. కలెక్షన్ల మోత మోగించిన చిరు
చిరంజీవి, నయనతార, వెంకటేష్ కలిసి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ రీజనల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా 21వ రోజు కూడా సత్తా చాటింది. గత వారంతో పోల్చితే కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం పెరగ్గా, శనివారంతో పోల్చితే ఆదివారం మరింతగా పెరిగింది. మొత్తంగా చిరంజీవి మూవీ ఆదివారం ర్యాంపేజ్ ఆడిందని చెప్పొచ్చు.
శుక్రవారం ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.కోటి ముప్పై లక్షలు రాగా, శనివారం రూ.1.9కోట్లు వచ్చాయి. వీకెండ్ బాగా పెరిగాయి. ఇక ఆదివారం శనివారానికి మించి వచ్చాయి. ఏకంగా రెండున్నర కోట్లు రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది. అంటే 21వ రోజు కూడా ఈ స్థాయి కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఊహించని జంప్‌గా చెప్పొచ్చు.
21 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారి ఊచకోత
ప్రముఖ బాక్సాఫీసు సైట్ సాక్నిల్క్ లెక్కల ప్రకారం 21 రోజులకుగానూ ఈ మూవీ రూ.289కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.208 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. రూ.247కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ.205కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటుకుని ఏకంగా రూ.60కోట్ల లాభాలను గడించిందని టాక్. అంతేకాదు ఈ సినిమా రీజినల్ ఫిల్మ్స్ లో నెంబర్ వన్‌గా నిలిచింది. `హనుమాన్`పేరుతో ఉన్న రూ.201కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ మన శంకర వర ప్రసాద్ గారి ప్రభంజనం
ఇక చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. కామెడీ, ఫ్యామిలీ అంశాలు, పిల్లలకు నచ్చే ఎలిమెంట్లు, మహిళలకు సంబంధించిన అంశాలు, యూత్‌ని ఆకట్టుకునే లవ్ ట్రాక్, యాక్షన్ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమా రూపొందించారు అనిల్ రావిపూడి. సంక్రాంతి పండక్కి మంచి విందు భోజనం పెట్టారు. దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీని చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. చిరంజీవితో చేసిన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది సుస్మిత.
చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగిస్తోంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


