
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి ఊర్రూతలూగించే ‘రయ్ రయ్ రారా’ సాంగ్ విడుదల!
- ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్ తో సాంగ్ అదిరింది అంతే!
- చరణ్ డాన్స్ చూసి మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి – ప్రశంసల వర్షం కురిపించారు!
- ఏప్రిల్ 30న ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ – మెగా ఫ్యాన్స్ కు పండగే పండగ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘రయ్ రయ్ రారా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ కు మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందించారో చూద్దాం.
దుమ్మురేపే ‘రయ్ రయ్ రారా’ సాంగ్!
Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
దానికి కారణం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవడం. ఈ సినిమా ప్లాప్ తో రామ్ చరణ్ రేస్ లో కాస్త వెనుకబడ్డాడు. అందుకే, పెద్ది సినిమాతో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పెద్ది సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లోనే ఉంది. టీజర్ కానీ, చికిరి సింగ్ కానీ సోషల్ మీడియాను షేక్ చేశాయి.
చరణ్ డాన్స్ పై చిరు కామెంట్స్ వైరల్
ఇక తాజాగా, పెద్ది సినిమా నుంచి రయ్ రయ్ రారా అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. హీరో పరిచయ గీతంగా వస్తున్న ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బీట్, దానికి అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ నెక్స్ట్ లెవల్లో సెట్ అయ్యాయి. ఇక ఆ పాటలో రామ్ చరణ్ చేసిన డాన్స్ కి సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అదిరిపోయే మూమెంట్స్ రామ్ చరణ్ వేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్!
కేవలం డాన్స్ చేయడమే కాదు తండ్రిలాగా గ్రేసును కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు చరణ్. అందుకే, ఆడియన్స్ నుంచి ఈ సాంగ్ పై ప్రశంసలు దక్కుతున్నాయి. తాజా రయ్ రయ్ రారా సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా స్పదించాడు. ఈమేరకు నెట్టింట పోస్ట్ పెట్టాడు.. ‘రయ్ రయ్ రారా సాంగ్ లో ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ అద్భుతంగా కలిసిపోయాయి. సూపర్ స్పీడ్‌లోనూ అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులు వేస్తున్న చరణ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంద’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో రయ్ రయ్ రారా సాంగ్ పై మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘రయ్ రయ్ రారా’ సాంగ్ తో సినిమాకు మరింత హైప్ వచ్చింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


