|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్: మెగాస్టార్ షాకింగ్ రియాక్షన్! డైరెక్టర్ హరీష్ శంకర్ ఎమోషనల్ కామెంట్స్!

Published: 15-03-2026, 6:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్: మెగాస్టార్ షాకింగ్ రియాక్షన్! డైరెక్టర్ హరీష్ శంకర్ ఎమోషనల్ కామెంట్స్!
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!
  • ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ.
  • చిరు ట్వీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ అదిరిపోయే రిప్లై: ఆనందానికి అవధులు లేవు!
  • మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎంతో ఉస్తాద్ భగత్ సింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రశంసించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

చిరంజీవి ట్వీట్‌తో ఒక్కసారిగా వైరల్

Chiranjeevi: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ పై చిరంజీవి ట్వీట్, దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్ వైరల్ గా మారాయి.

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో బాక్సాఫీస్ వేటకు పవన్ కల్యాణ్ రెడీ అయిపోయాడు. అతను పోలీస్ గా నటించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఎమోషనల్ రిప్లై

‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ’తో అన్నీ శుభాలే. డియర్ కల్యాణ్ బాబు, హరీష్ శంకర్, మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కు అభినందనలు’’ అని చిరు ఎక్స్ లో పోస్టు చేశారు.

‘‘అయ్యబాబోయ్… అన్నయ్య !! మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని తెలిసింది. అయినా సరే వీలు చేసుకుని మా ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు’’ అని హరీష్ శంకర్ పోస్టులో రాసుకొచ్చాడు.

ఉగాదికి థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ బీజీఎం అందించాడు.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.