|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ అవార్డ్స్ దుమారం: ఏపీ సర్కార్ పై చిరు షాకింగ్ కామెంట్స్! చంద్రబాబుకి మెగా రిక్వెస్ట్!!

Published: 19-03-2026, 3:05 PM
గద్దర్ అవార్డ్స్ దుమారం: ఏపీ సర్కార్ పై చిరు షాకింగ్ కామెంట్స్! చంద్రబాబుకి మెగా రిక్వెస్ట్!!
  • గద్దర్ అవార్డుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాని ప్రోత్సహించడంలో వెనుకబడిందని చిరంజీవి ఆవేదన, చంద్రబాబుకి విజ్ఞప్తి!
  • తెలంగాణ ప్రభుత్వం కళాకారులని ప్రోత్సహిస్తుంటే ఏపీలో శూన్యమని చిరు అసంతృప్తి!
  • తెలుగు సినిమా అభివృద్ధికి ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని చిరంజీవి ఆకాంక్ష!

టాలీవుడ్ లో సంచలనం! గద్దర్ అవార్డుల వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గద్దర్ అవార్డుల్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో గురువారం రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరికొందరు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదే విధంగా గద్దర్ అవార్డ్స్ లో చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ లాంటి సినీ ప్రముఖులు సందడి చేశారు.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళాకారులని గౌరవించే రాజ్యం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది అని నానుడి ఉంది. దానిని సీఎం రేవంత్ రెడ్డిగారు అర్థం చేసుకుని నిజం చేస్తున్నారు. సినిమా ప్రభావం ఎంత ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి బాగా అర్థం చేసుకున్నారు. అందుకే సినిమా రంగాన్ని ప్రోత్సాహిస్తున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి అసంతృప్తి!

తెలుగు సినిమా సమస్యలని అడిగి తెలుసుకుంటున్నారు. చర్చించి పరిష్కరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మన సంస్కృతి, కళలని ప్రోత్సాహిస్తోంది. సినిమాకి ఒక దేశ ఎకానమీని పెంచే శక్తి ఉంది. ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్ గుర్తుకు రావాలి అనే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబుకి చిరంజీవి రిక్వెస్ట్!

అదే క్రమంలో ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది సందర్భమో అసందర్భంలో తెలియదు.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కళాకారులని, సినిమాని ప్రోత్సాహించడంలో వెనుకబడింది. ఈ స్టేజీపై నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వస్ట్ చేస్తున్నా. ఏపీ కూడా తెలంగాణ నుంచి స్ఫూర్తి పొంది కళాకారులని ప్రోత్సాహించేలా అవార్డులు ఇవ్వాలి అని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు.

చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.