|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు vs భానుప్రియ: డాన్స్‌లో వార్నింగ్! మెగాస్టార్ మూవీ అప్‌డేట్స్ లీక్! రికార్డు వసూళ్లు!

Published: 16-02-2026, 12:36 PM
చిరు vs భానుప్రియ: డాన్స్‌లో వార్నింగ్! మెగాస్టార్ మూవీ అప్‌డేట్స్ లీక్! రికార్డు వసూళ్లు!
  • మెగాస్టార్ చిరంజీవి భుజానికి కీ హోల్ సర్జరీ పూర్తి, అభిమానుల ఆందోళన వీడింది, త్వరలో బాబీతో మూవీ ప్రారంభం!
  • భానుప్రియ అద్భుతమైన డ్యాన్సర్, ఆమెతో పోటీగా చేయడంతో కెమిస్ట్రీ మిస్సయిందని చిరు స్వీట్ వార్నింగ్!
  • మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రూ.290 కోట్లు వసూలు, రీజనల్ మూవీస్‌లో రికార్డు సృష్టించింది.
  • బాబీ దర్శకత్వంలో చిరంజీవి మూవీ మార్చి చివరిలో లేదా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది, భారీ అంచనాలు!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక సంచలన వార్త! ఆయన భానుప్రియ గారికి డాన్స్ విషయంలో వార్నింగ్ ఇచ్చారట. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడాల్సిందే. మూవీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు.

చిరంజీవి సర్జరీ: అభిమానులకు గుడ్ న్యూస్!

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే బ్లాక్‌ బస్టర్‌ ని అందుకుని స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో రీజినల్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా దాదాపు రూ.290కోట్లు వసూలు చేసింది. రీజనల్‌ మూవీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త మూవీకి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. మార్చి చివర్లోగానీ, ఏప్రిల్‌లోగానీ మూవీ ప్రారంభం కానుంది.

తాజాగా చేతికి గాయంతో కనిపించారు చిరంజీవి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు.  చిన్న భుజానికి కీ హోల్‌ సర్జరీ జరిగిందని, ఇప్పుడు బాగానే ఉన్నట్టు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నానని, తిరిగి రెగ్యూలర్‌ దిన చర్యకి వస్తున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన నితిన్‌ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చిరు. ఈ సర్జరీ ఈజీగా, సింపుల్‌గా చేయడంలో ఆయన ఎంతో కేర్‌ తీసుకున్నారని, తన ప్రతిభని చూపించారని తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందుతూ, తనపై ప్రేమని వ్యక్తం చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.

భానుప్రియతో చిరు: డ్యాన్స్ వార్నింగ్ వెనుక కథ!

ఈ క్రమంలో తాజాగా చిరంజీవి ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌ అవుతుంది. ఇందులో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ భాను ప్రియ గురించి తెలిపారు. ఆమె అద్బుతమైన డాన్సర్‌ అని, ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ డాన్సర్లతో ఆమె ఒకరు అని తెలిపారు. ఆమెతో కలిసి నటించడం అద్బుతమైన అనుభవమని చెప్పారు. తనతో డాన్స్ చేయడం చాలా టఫ్‌గా ఉండేదని, మిగిలిన హీరోయిన్లతో ఈజీగా డాన్స్ చేసేవారట. కానీ భానుప్రియతో కష్టపడాల్సి వచ్చేదని తెలిపారు చిరంజీవి.

ఈ క్రమంలో భానుప్రియకి ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌ ని రివీల్‌ చేశారు చిరు. భానుప్రియ డాన్స్ విషయంలో కాంపిటీషన్‌గా భావించేదట. తనతో పోటీగా చేసేదట. కానీ ఈ క్రమంలో తమ మధ్య కెమిస్ట్రీ, ఆ రొమాన్స్ మిస్ అయ్యేదట. పాటల్లో డాన్స్ చేస్తే ఏదో కాంపిటీషన్‌లో పాల్గొన్నట్టుగానే ఉండేదని, కానీ ఆ డాన్స్‌ ని, కెమిస్ట్రీని, రొమాన్స్ ని ఎంజాయ్‌ చేసేవాళ్లం కాదని తెలిపారు. దీంతో  ఆమెకి తన మనసులో మాట చెప్పేశారట. ఇలా పోటీగా డాన్స్ చేస్తున్నారు తప్పితే, కెమిస్ట్రీ పండటం లేదు, డాన్స్ ని ఆస్వాధించడం లేదు, తెరపై చూస్తే అది బాగుండదని చెప్పారట. దీంతో చిరంజీవి చెప్పిన సలహాని భాను ప్రియ కూడా పాజిటివ్‌గా తీసుకుని ఆ రకంగా తన డాన్సు ని మార్చుకునే ప్రయత్నం చేసిందట. ఆ తర్వాత నుంచి తనతో డాన్స్ ని ఎంజాయ్‌ చేసే ప్రయత్నం చేసినట్టు తెలిపారు చిరంజీవి. మంచు లక్ష్మీతో టాక్‌ షోలో చిరు ఈ విషయాన్ని తెలిపారు.

బాబీతో మూవీ: మెగాస్టార్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్!

అయితే ఈ విషయాన్ని భానుప్రియ కూడా ఒప్పుకుంది. చిరంజీవితో రొమాన్స్ ని ఎంజాయ్‌ చేయలేకపోయేదాన్ని అని తెలిపారు. తన దృష్టి మొత్తం డాన్స్ బాగా చేయాలనే దానిపైనే ఉండేదని, దాని కారణంగానే రొమాన్స్ మీద ఫోకస్‌ పెట్టలేకపోయానని, ఆ వెలితి ఉంటుందని చెప్పింది. చిరంజీవి కూడా ఈ విషయాన్ని చెప్పేవారని తెలిపింది భానుప్రియ. గతంలో ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ వెల్లడించారు.

చిరంజీవి గారి మూవీ అప్డేట్స్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. మెగాస్టార్ త్వరలో బాబీ దర్శకత్వంలో కనిపించనున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.