|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు విధ్వంసం! బాలయ్య రికార్డులు బ్రేక్.. బాక్సాఫీస్ షేక్! మెగాస్టార్ మాస్ జాతర!!

Published: 12-01-2026, 8:00 AM
చిరు విధ్వంసం! బాలయ్య రికార్డులు బ్రేక్.. బాక్సాఫీస్ షేక్! మెగాస్టార్ మాస్ జాతర!!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ప్రీమియర్ల ద్వారానే రూ. 11 కోట్లు రాబట్టింది – టాలీవుడ్ షాక్!
  • బాలయ్య ‘అఖండ 2’ ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసిన చిరంజీవి సినిమా – సెన్సేషనల్ హిట్!
  • సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ – నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు మూవీ – విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో అదరగొట్టారు!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుల మోత మోగిస్తోంది. బాలయ్య నటించిన అఖండ 2 రికార్డులను బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అఖండ 2 రికార్డు బ్రేక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ మన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ( Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమా సంక్రాంతి కానుకగా నిన్న రాత్రి రిలీజ్ అయింది. నిన్న రాత్రి నుంచి ప్రీమియర్లు పడగా, ఇవాళ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించిన నయనతార హీరోయిన్ గా మెరిసారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేశారు. ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో.. జనాలు ఎగబడి చూస్తున్నారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ కలెక్షన్ల సునామీ

అఖండ 2 రికార్డు బ్రేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి?

ఓవర్సీస్‌లో చిరంజీవి ప్రభంజనం

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బాలయ్య ( Nandamuri Balayya) నటించిన అఖండ 2 ఓవర్సీస్ లో నమోదు చేసిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. అఖండ 2 ( Akhanda 2 Movie) ఉత్తర అమెరికాలో ఫైనల్ కలెక్షన్స్ రూ. 9 కోట్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ ద్వారానే రూ. 11 కోట్లు రాబట్టడం గమనార్హం. దీంతో ఈ కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారట. ఈ వేవ్ ఇలాగే, కొన‌సాగితే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

చిరంజీవి సినిమా కలెక్షన్ల వేవ్ చూస్తుంటే ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.