
స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగభరితంగా స్పందించారు. ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ఈ ఘనత యువతకు స్ఫూర్తినిస్తుందని ఆయన కొనియాడారు.
Key Points
స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ విజయంపై ప్రశంసలు కురిపించారు, ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇస్రో, ఇన్ స్పేస్ మద్దతుతో ఈ ప్రయోగం జరిగింది.
ఈ విజయం ప్రైవేట్ స్పేస్ సెక్టార్ కు కొత్త జోష్ నిచ్చి, యువతకు స్ఫూర్తినిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
Vikram Success: స్కై రూట్ ఎరోస్పేస్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విక్రమ్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే ..ఈ క్రమంలో ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయగా, తాజాగా మెగాస్టార్ చిరు ఈ సక్సెస్ ని విష్ చేస్తూ మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పారు.ఇక మెగాస్టార్ ఇలా ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అభిమానులు లైక్ లు షేర్లతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ సపరేట్ చేస్తున్నారు కూడా.
అదిరిపోయే సక్సెస్ వెనుక మన హైదరాబాద్ బ్రాండ్
ఇస్రో, ఇన్ స్పేస్ సంస్థల సపోర్ట్ తో ఇండియాలోనే మొట్టమొదటి ప్రయి వేట్ ఆర్బిటాల్ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్ళడం మనస్ఫేస్ జర్నీలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆకాశం ఎత్తేశారు మెగాస్టార్.ఇక ఈ అదిరిపోయే సక్సెస్ వెనుక మన హైదరాబాద్ బ్రాండ్ ఉండటం విశేషం .హైదరాబాద్ కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీలోని యంగ్ సైంటిస్టుల టీం ఈ రాకెట్ ని పూర్తిగా ఇక్కడే డిజైన్ చేసి డెవలప్ చేసిందన్న విషయం వింటేనే తన గుండె గర్వంతో ఒప్పొంగిపోతుందని ఎమోషనల్ అయ్యాడు చిరు.
విక్రమ్ 1: ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన శకం
టీమ్ విక్రమ్ 1 పడ్డ కష్టానికి దక్కిన అసలైన రివార్డు ఇదే
హిస్టారికల్ సక్సెస్ దేశంలోని కోట్ల మంది యూత్ లో ఉషారు నింపుతుందని వికసిత్ భారత్ వైపు మన దేశాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందన్నా ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇక టీమ్ విక్రమ్ 1 పడ్డ కష్టానికి దక్కిన అసలైన రివార్డు ఇదే అని చెబుతూ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు అందించాడు మెగాస్టార్ చిరంజీవి.
విక్రమ్ వన్ ప్రయోగం ఒక బలమైన పునాదిని
హైదరాబాద్ యువ శాస్త్రవేత్తల అద్భుత విజయం
ఇక ఈ విక్రమ్ అని ప్రయోగం మనదేశంలో ప్రవేట్ స్పేస్ సెక్టార్ కి సరికొత్త జోష్ ఇస్తుందటంలో సందేహం లేదు.గతంలో ఇలాంటి ప్రయోగాలు కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జరిగేవికానీ ఇప్పుడు యువ స్టార్టప్‌లు కూడా గ్లోబల్ లెవెల్‌లో సత్తా చాటుతున్నాయని ఈ సక్సెస్ నిరూపించింది. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు స్పేస్ హబ్‌గా కూడా మారుతోందని గర్వంగా చెప్పుకోవచ్చు కూడా.
ఇస్రో వంటి దిగ్గజ సంస్థల సపోర్ట్‌తో మన లోకల్ టాలెంట్ ప్రపంచ వేదికపై మెరవడం ఒక విశేషమైతే . చిరంజీవి లాంటి గ్లోబల్ ఐకాన్ దీనిపై స్పందించడం ఇక్కడ మరో విశేషం.ఇక ఈ ట్వీట్ కొత్త తరానికి మరింత జోష్ ఇస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా అంటే అంతరిక్షరంగంలో భారత్ మరిన్ని శిఖరాలను చేరుకునేందుకు ఈ విక్రమ్ వన్ ప్రయోగం ఒక బలమైన పునాదిని చెప్పక తప్పదు .
https://x.com/KChiruTweets/status/2078421149441237083
మొత్తంగా, విక్రమ్ 1 ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ఒక బలమైన పునాదిని వేసింది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, యువతకు, ప్రైవేట్ స్టార్టప్‌లకు సరికొత్త ఆశలను, అవకాశాలను కల్పించింది.


