|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ కామెంట్స్! సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కెమెరామెన్‌కు సంబంధం లేదన్న చోటా కె నాయుడు!!

Published: 11-03-2026, 8:05 AM
షాకింగ్ కామెంట్స్! సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కెమెరామెన్‌కు సంబంధం లేదన్న చోటా కె నాయుడు!!
  • సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కెమెరామెన్‌కు సంబంధం లేదని షాకింగ్ కామెంట్స్ చేసిన చోటా కె నాయుడు!
  • దర్శకుడి గుడ్డి నమ్మకంతోనే సీజీ వర్క్స్ చేస్తున్నాం: సంచలన వ్యాఖ్యలు!
  • తెలుగు సినిమా పరిశ్రమలో పెరిగిన గ్రాఫిక్స్ ప్రాధాన్యత: చోటా కె నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  • 24 క్రాఫ్ట్స్ తో పాటు సీజీ కూడా జాయిన్ అయింది: కెమెరామెన్ చోటా కె నాయుడు

టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కెమెరామెన్‌కు సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనిపై టాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

సినిమా సక్సెస్‌లో కెమెరామెన్ పాత్ర లేదా?

సీనియర్ కెమెరామెన్ చోటా కె నాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. చోటా కెరీర్లో సీజీ పనులు అత్యధికంగా ఉన్న సినిమాలకు కూడా పనిచేశాడు. అంజి, డమరుకం లాంటి భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉన్న సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

దర్శకుడి మాటే శిరోధార్యం అంటున్న చోటా!

తాజాగా ఈ సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, వాటి సక్సెస్, ఫెయిల్యూర్ వెనక కెమెరామెన్ హస్తం ఏమైనా ఉంటుందా? అనే ప్రశ్న చోటాకి ఎదురయింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ… సీజీ వర్క్ ఎక్కువ ఉన్న సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ వెనక కెమెరామెన్ హస్తం ఏమాత్రం ఉండదు. దర్శకుడు వచ్చి ఒక సన్నివేశంలో ఒక ప్లేస్లో లైట్ పెట్టమంటాడు, అది రాంగ్ అని మాకు తెలుసు.

గ్రాఫిక్స్ హవా: చోటా కె నాయుడు సంచలన వ్యాఖ్యలు!

కానీ అలా పెట్టకుంటే రేపు సినిమా విడుదల అయ్యాక బాగో లేకపోయినా, ఒకవేళ సీజీ వర్క్ జరిగే టైంలో ఏ కాస్త తేడా వచ్చినా మమ్మల్ని బ్లెమ్ చేస్తారు. అందుకే మేము గుడ్డిగా వారు చెప్పింది చేస్తాం, దానితో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లతో పాటు మరో క్రాఫ్ట్ కూడా జాయిన్ అయింది, అదే సీజీ. నేను ఈ మధ్యకాలంలో సిజి పర్సన్ ఉంటేనే కెమెరా స్విచ్ ఆన్ చేస్తున్నాను, లేదంటే షూటింగ్ చేయడం లేదు. అంతలా గ్రాఫిక్స్ ప్రాధాన్యత తెలుగు సినిమా పరిశ్రమలో పెరిగింది అని ఈయన సమాధానం ఇచ్చాడు.

చోటా కె నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన మాటల్లోని నిజం ఎంతో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.