|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Cinema Controversy: పేరులోనే అంతా ఉంది!

Published: 23-06-2025, 3:53 AM
Cinema Controversy: పేరులోనే అంతా ఉంది!

భారతీయ సినిమా ఇండస్ట్రీలో పేర్ల వల్ల ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. కొన్ని సినిమాలకు పేర్లు మార్చాల్సి వచ్చింది. ఇలాంటి కొన్ని వివాదాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

సినిమా పేర్లు వివాదాలకు కారణమవుతున్నాయి.

2

పద్మావత్, ఎస్ దుర్గా, సత్యప్రేమ్ కీ కథ సినిమాలకు పేర్లు మార్చాల్సి వచ్చింది.

4

సినిమా రిలీజ్ కోసం పేర్లు మార్చడం సర్వసాధారణం అవుతోంది.

పేర్ల వల్ల సినిమాలకు ఎదురైన కష్టాలు

ఎల్లలు దాటేసిన భారతీయ సినిమా.. సొంతగడ్డపైనే చిక్కులు ఎదుర్కొంటోంది!. ‘‘ఆ పేరులో ఏముంది లే?’’ అని అనుకోవడానికి ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఆ పేరే ఇప్పుడు సినిమాకు అడ్డం పడుతోంది. జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ అనే సినిమాలో ‘జానకీ’ అనే పేరును మారిస్తేనే రిలీజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామంటోంది సెన్సార్‌ బోర్డు. మాలీవుడ్‌ స్టార్‌, బీజేపీ ఎంపీ.. కేంద్ర మంత్రి(సహాయ) సురేష్‌ గోపి ఈ చిత్రంలో కీ రోల్‌ పోషించడం ఇక్కడ మరో విశేషం.

సినిమాను దేశం అనే బౌండరీని దాటించి.. ఇంటర్నేషనల్‌ ఆడియొన్స్‌ను అలరించేందుకు మన ఫిల్మ్‌మేకర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోజులివి. ఫిక్షన్‌, బోల్డ్‌, ఒక్కోసారి సామాజిక అంశాలను స్పృశిస్తూ సక్సెస్‌ అవుతున్నారు. అయితే ఈ మసాలాలను అందరూ మెచ్చడం లేదు. రాజకీయ, మతపరమైన వర్గాల నుంచి ఒక్కోసారి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదీ పేర్ల విషయంలోనే కావడం మరో విశేషం. అలాంటి కొన్ని ‘సినిమా కష్టాల’ను ఓసారి గుర్తు చేసుకుందాం.

పద్మావత్‌ 2017-2018లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన చిత్రం. సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లో దీపికా పదుకొనే, రణ్‌ర్‌ సింగ్‌‌, షాహిద్‌కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్‌ ఫిక్షన్‌డ్రామా. అయితే కర్ణిసేన నుంచి తీవ్ర అభ్యంతరాలతో ఈ సినిమా విడుదల అనుమానమే అనుకున్నారంతా. చివరకు పద్మావత్‌గా పేరును మార్చేయడంతో పాటు పలు సీన్లకు కత్తెర వేయడంతో  విడుదలకు లైన్‌  క్లియర్‌ అయ్యింది.

ఎస్‌ దుర్గా మలయాళంలో 2017లో రిలీజ్‌ అయిన చిత్రం. అయితే విడుదలకు ముందు ఈ చిత్రం సెక్సీ దుర్గ పేరుతో వివాదంలోకి ఎక్కింది. హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాతే ఈ పేరును ఎస్‌ దుర్గాగా మార్చడంతో విడుదలకు అనుమతించారు. రాజ్‌శ్రీ దేశ్‌పాండే, కన్నణ్‌ నాయర్ లీడ్‌ పాత్రల్లో మతాంతర వివాహంనేపథ్యంతో సనల్‌ కుమార్‌ శశిథరన్‌  ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

సత్యప్రేమ్‌ కీ కథ సమీర్‌ విద్వాన్స్‌ డైరెక్షన్‌లో ..  కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీ జంటగా 2023లో రిలీజ్‌ అయిన చిత్రమిది. తొలుత ఈ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాకు సత్యనారాయణ కీ కథ అనుకున్నారు.అయితే దేవుడి పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం ముదరముందే పేరును మార్చేసి రిలీజ్‌ చేశారు.

పద్మావత్, ఎస్ దుర్గా, సత్యప్రేమ్ కీ కథ వివాదాలు

జానకీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ ఇది తాజా కాంట్రవర్సీ. మలయాళ సీనియర్‌ హీరో సురేష్‌ గోపి ముఖ్యపాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. కోర్టు రూమ్‌ డ్రామాగా  ప్రవీన్‌ నారాయణన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో లీడ్‌ పాత్ర దాడికి గురయ్యే బాధితురాలు. జానకీ అంటే సీతాదేవి(శ్రీరాముడి భార్య)కి మరో పేరు అని, భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి పేరు మారిస్తేనే రిలీజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్పష్టం చేసింది. పైపెచ్చు ఈసినిమాకు ఇదివరకే 13+ సర్టిఫికెట్‌ను బోర్డు ఇష్యూ చేయడం గమనార్హం. ఇంతేకాదు..

రీసెంట్‌గా ఇలాగే ఓ మలయాళ సినిమాలో హీరోయిన్‌ పేరును జానకీ నుంచి జయంతిగా మార్చిన తర్వాతే రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యిందని కేరళ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జనరల‌ సెక్రటరీ  బీ ఉన్నికృష్ణన్‌ చెబుతున్నారు. అయితే అదేం చిత్రమో పేరును చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పై చిత్రాలే కాదు.. ఈ తరహా అభ్యంతరాల వివాదాలతో ార్పులుసంతరించుకున్న చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇవేకాదు.. కంగనా రనౌత్‌ తలైవి, అనుష్క రుద్రమదేవి, రిషబ్‌ శెట్టి కాంతార, సుదీప్తో తీసిన ది కేరళ స్టోరీ చిత్రాల విషయంలోనూ విడుదలకు ముందే పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే మేకర్ల క్లారిఫికేషన్‌ కారణంగా ఈ చిత్రాల విడుదలకు పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. సెన్సార్‌ బోర్డు తన కత్తెరకూ పదును పెట్టలేదు.

🎬 సెన్సార్ బోర్డు (CBFC)కు ఏం హక్కు ఉంది?

పేరు, సన్నివేశాలు, సంభాషణలు ద్వారా జాతిపరమైన లేదంటే మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందనుకుంటే, వారు సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.

జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ – తాజా వివాదం

పై విషయంలో  మార్పులకు సిఫార్సు చేయవచ్చు (ఇందులో పాత్ర పేరు, శీర్షిక, సంభాషణలవంటి అంశాలుంటాయి)

సర్టిఫికేట్ లేకుండా సినిమా విడుదల చేయటం చట్టవిరుద్ధం, కాబట్టి చాలా సందర్భాల్లో దర్శకులు సూచించిన మార్పులను అంగీకరిస్తారు.

నేరుగా సినిమాగానీ, క్యారెక్టర్‌గానీ పేరు మార్చమని ఆదేశించడం. ఎందుకుంటే.. తుది నిర్ణయం ఆ సినిమా దర్శకనిర్మాతలదే.

CBFC యొక్క నిర్ణయాన్ని Film Certification Appellate Tribunal (FCAT) లేదంటే కోర్టుల్లో ఆ చిత్ర దర్శకనిర్మాతలు సవాల్‌ చేయొచ్చు.

సినిమా పేర్లు వివాదాలకు దారితీస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాల వల్ల సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతోంది. పేర్లను మార్చడం అనేది తప్పనిసరిగా మారుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.