
కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ పార్టీ మరోసారి ప్రకటించింది. అయితే, చర్చల కోసం తాము ఎవరి వద్దకు వెళ్లబోమని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు, ముఖ్యంగా జేపీ నడ్డా జంతర్ మంతర్‌కు వచ్చి తమతో చర్చలు జరపాలని సీజేపీ డిమాండ్ చేసింది. తమ సమయం విలువైనదని, అర్థం లేని చర్చలు వద్దని తేల్చిచెప్పింది.
Key Points
సీజేపీ పార్టీ కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించింది.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా తమతో చర్చలకు జంతర్ మంతర్‌కు రావాలని డిమాండ్ చేసింది.
భద్రతా ఆందోళనలుంటే సమీపంలోని తటస్థ వేదికకు రావడానికి సీజేపీ అంగీకరించింది.
తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశంతోనే చర్చలకు రావాలని సీజేపీ స్పష్టం చేసింది.
చర్చలకు సిద్ధం, కానీ మా వద్దకే రావాలి
కేంద్రంతో చర్చలకు మేము సిద్ధమేనని సీజేపీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. అయితే చర్చల కోసం తాము ఎవరి ఇంటికి వెళ్లబోమని తెలిపింది. ఈ మేరకు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. రెండో విడత చర్చల కోసం ఇవాళ ఉదయం పోలీసులు మళ్లీ మమ్మల్ని సంప్రదించారని చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఆయన నివాసానికి రమ్మని ఆహ్వానించినట్లు తెలిపారు. కానీ ఈ ఆహ్వానాన్ని తాము స్పష్టంగా తిరస్కరించినట్లు సౌరవ్ దాస్ వెల్లడించారు. మేము ఎవరి ఇంటికి, ఆఫీస్‌కు వెళ్లేదే లేదని.. కేంద్ర మంత్రులు, ప్రభుత్వం మాతో చర్చలు జరపాలంటే ఇకపై జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ జనతా దర్బార్ జరుగుతోందని ప్రజల ముందుకు వచ్చి చర్చలు జరపాలన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సౌరవ్ దాస్ తాము చదువుకున్న వ్యక్తులమేనని తాము పట్టుదలకు పోయే వ్యక్తులం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు చర్చల కోసం జంతర్ మంతర్ వద్దకు వస్తే తమ భద్రతపై ఏదైనా ఆందోళన ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా తటస్థ (న్యూట్రల్) వేదికగా సమావేశమయ్యేందుకు మేము సిద్ధమేనన్నారు. ఈ విషయంలో కేంద్రం సమాధానం కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. అలాగే మా డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలని అర్థం లేని చర్చల కోసం మమ్మల్ని పిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మా సమయం చాలా విలువైనది. వేలాది మంది ప్రజలు ఇప్పటికీ ఈ నిరసనలో పాల్గొంటున్నారు, వారిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని తెలిపారు. .ప్రభుత్వం నిజంగా మాతో చర్చలు జరిపే ఉద్దేశంతో ఉందో లేదో ముందుగా స్పష్టం చేయాలని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.
నడ్డా జంతర్ మంతర్‌కు రావాల్సిందే: సీజేపీ
అర్థం లేని చర్చలు వద్దు: సీజేపీ షరతులు
మొత్తానికి, సీజేపీ తమ డిమాండ్లపై పట్టుదలతో ఉంది. కేంద్రం చర్చలకు నిజంగా సిద్ధంగా ఉంటే, తమ వద్దకే రావాలని, తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని సీజేపీ స్పష్టం చేసింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


