|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీజేపీ నిరసన: మద్దతుదారుల అపూర్వ స్పందన! స్విగ్గీ, జొమాటోలతో ఆహారం, నీరు సప్లై

Published: 22-07-2026, 3:05 AM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన రోజురోజుకు పెరుగుతోంది. విద్యార్థులు, రాజకీయ పార్టీల మద్దతుతో పాటు, గుర్తు తెలియని దాతలు ఫుడ్ యాప్స్ ద్వారా భారీగా ఆహారం, నీరు పంపిస్తున్నారు. కేంద్రం చర్చలకు సిద్ధమైనా, కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గడం లేదు.

Key Points

1

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కొనసాగుతోంది.

2

విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నుండి ఈ నిరసనకు మద్దతు లభిస్తోంది.

4

కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉన్నా, నీట్ పేపర్ లీక్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం లేదు.

సీజేపీ నిరసనకు పెరుగుతున్న మద్దతు

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న నిర‌స‌న‌కు స‌పోర్ట్ పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన ఈ ఆందోళ‌న‌లో విద్యార్థుల‌తో పాటు వివిధ రాజ‌కీయ పార్టీల నుండి స‌పోర్ట్ ల‌భిస్తోంది. మ‌రోవైపు విద్యార్థులు, సీజేపీ నిర‌స‌న‌కు మ‌ద్ద‌తిస్తూ గుర్తు తెలియ‌ని దాతలు భారీగా ఆహారాన్ని పంపిస్తున్నారు. నిర‌స‌న‌కారులు రాత్రింభ‌వ‌ళ్లు ఆందోళ‌న కొన‌సాగిస్తుండ‌గా అక్క‌డకు కొంద‌రు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. దీంతో అవ‌స‌రానికి మించి అక్క‌డకు ఆహారం చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఆన్ లైప్ యాప్స్ ద్వారా ఆహారంతో పాటు నీటిని సైతం స‌ప్లై చేస్తున్నారు. మ‌రోవైపు కేంద్రం ఒక అడుగు దిగి చ‌ర్చ‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే సోన‌మ్ వాంగ్ చుక్ చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి వెళ్లి కేంద్ర‌మంత్రులు జేపీ న‌డ్డా, జితేంద్ర‌సింగ్ మాట్లాడారు. కేంద్రం చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. నిన్న ప్ర‌ధాని మోడీ నివాసం ముందు కాంగ్రెస్ ఆందోళ‌న చేప‌ట్ట‌గా ఆయ‌న‌తోనూ మాట్లాడారు. అయితే కేంద్రం మాత్రం నీట్ పేప‌ర్ లీక్ కు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయ‌డాన్ని అంగీక‌రించ‌డంలేద‌ని ప‌రిస్థితులు చూస్తే అర్థం అవుతోంది.

ఫుడ్ యాప్స్ ద్వారా ఆహార, నీటి సరఫరా

ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది..కేంద్రానికి సీజేపీ జాతీయ ప్రతినిధి వార్నింగ్

కేంద్రం చర్చలకు సిద్ధం, రాజీనామాకు నిరాకరణ

మోడీని కాల్చిపరేస్తా.. సీజేపీ నిరసనలో బూతులతో రెచ్చిపోయిన యువకుడు

సీజేపీ నిరసనకు లభిస్తున్న అపూర్వ మద్దతు, కేంద్రం చర్చలకు సిద్ధపడటం ప్రస్తుత పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. అయితే, కేంద్రం కీలక డిమాండ్‌పై రాజీపడకపోవడంతో ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.