|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీఎం విజయ్‌ని ఆలింగనం చేసుకున్న అభిమాని: వైరల్ వీడియో వెనుక అసలు కథ!

Published: 14-07-2026, 6:22 AM
సీఎం విజయ్‌ని ఆలింగనం చేసుకున్న అభిమాని: వైరల్ వీడియో వెనుక అసలు కథ!

సాధారణంగా నాయకులు హంగు ఆర్భాటాలతో ఉంటారు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిరాడంబరత, మానవత్వం ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో జరిగిన సంఘటన ఆయన సింపుల్ సిటీకి నిదర్శనంగా నిలిచింది, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Key Points

1

తమిళనాడు సీఎం విజయ్ నిరాడంబరత ప్రజల్లో ఆయన పట్ల అభిమానం పెంచుతోంది.

2

చెన్నైలో నియామక పత్రాల పంపిణీలో ఓ అభ్యర్థి సీఎంను హగ్ చేసుకోవచ్చా అని అడిగాడు.

4

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీఎం సింపుల్ సిటీని ప్రశంసిస్తున్నారు.

సీఎం విజయ్ నిరాడంబరతకు నిదర్శనం

ఇవాళ, రేపు గల్లీ స్థాయి లీడర్లే హంగు ఆర్భాటాలతో హల్ చల్ చేస్తున్నారు. ఇక కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలైతే తమ దగ్గరకు రావాలన్నా తమతో మాట్లాడాలన్నా ఎదుటి వారికి ఓ రేంజ్ ఉండాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ ఆర్భాటాలకు చెక్ పెడుతూ నిరాడంబరత, మానవీణ కోణంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సింపుల్ సిటీ రోజురోజుకు ప్రజల్లో ఆయన పట్ల మరింత అభిమానం పెరిగేలా చేస్తోంది. ఇవాళ చెన్నైలో జరిగిన ఓ కర్యక్రమంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. తమిళనాడు వైద్యారోగ్యశాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ జరిగిన కార్యక్రమంలో సీఎం విజయ్ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి తన నియామక పత్రం అందుకుంటూ ‘సార్.. మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా? అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో స్పందించిన సీఎం చిరునవ్వుతో అంగీకరించారు. వెంటనే అతడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్పందిస్తు సీఎం సింపుల్ సిటీని ప్రశంసిస్తున్నారు.

నియామక పత్రాల పంపిణీలో అద్భుత క్షణం

నెటిజన్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి

సీఎం విజయ్ చూపిన ఈ మానవత్వం, నిరాడంబరత ఇతర రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం. ఇలాంటి చిన్న సంఘటనలు ప్రజల్లో నాయకుల పట్ల నమ్మకాన్ని, అభిమానాన్ని మరింత పెంచుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.