
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వార్త ఇది! తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించింది. రిలీజ్ కాగానే షాకింగ్ ట్రోల్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
Key Points
సీఎం విజయ్ 'జన నాయగన్' రిలీజ్ రోజే భారీ ట్రోలింగ్.
బాలయ్య 'భగవంత్ కేసరి' కాపీ అంటూ నెట్టింట రచ్చ.
పూజా హెగ్డే హీరోయిన్, అనిరుధ్ సంగీతం సినిమాకు హైలైట్.
KVN ప్రొడక్షన్ లో వినోద్ దర్శకత్వంలో రిలీజ్ అయిన చిత్రం.
బాలయ్య సినిమా కాపీనా? వైరల్ అవుతున్న ట్రోల్స్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ గురువారం రిలీజ్ అయింది. వాస్తవానికి మొన్నటి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… వాయిదా పడుతూ వచ్చింది. చివరికి అన్ని ఆటంకులను తొలగించుకొని రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి… జన నాయగన్ పేరుతో రిలీజ్ చేశానని సెటైర్లు పేల్చుతున్నారు.
50% మాత్రమే ఇందులో నుంచి కథను తీసుకున్నామని చెప్పి… జనాలను మోసం చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య సినిమానే అచ్చు బుద్ధి దించేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి రచ్చ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ హీరోగా చేయగా… పూజా హెగ్డే హీరోయిన్ గా మెరిసారు. ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ మ్యూజిక్ అందించారు. KVN ప్రొడక్షన్ లో ఈ సినిమా వచ్చింది.
‘జన నాయగన్’ కు షాకింగ్ ఓపెనింగ్!
పూజా హెగ్డే, అనిరుధ్ మేజిక్ వర్కౌట్ అవుతుందా?
‘జన నాయగన్’ పై ట్రోలింగ్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం మా వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి!


