|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కామెడీ రాయడం కష్టం

Published: 24-08-2025, 2:45 AM
కామెడీ రాయడం కష్టం

నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమకథా చిత్రం. దర్శకుడు కామెడీ రాయడం కష్టమని చెప్పారు.

Key Points

1

సుందరకాండ చిత్రం ఈ నెల 27న విడుదలవుతుంది.

2

రెండు వయసుల సమూహాల మధ్య ప్రేమకథ చిత్రం ప్రధాన అంశం.

4

నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ ప్రధాన పాత్రధారులు.

సుందరకాండ విడుదల తేదీ

నారా రోహిత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

చిత్ర కథాంశం

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్‌ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకు ‘సుందరకాండ’ తొలి చిత్రం. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ రోజుల్లో ఓ అబ్బాయికి 30 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ఆ అబ్బాయి నాకు ఫలానా ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడితే ఏంటి? అన్నదే ఈ సినిమా కథ.

దర్శకుడి అనుభవం

రెండు డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూపు ఉన్న లవ్‌ స్టోరీ ఇది. హీరో పాత్రకు ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్‌కుమార్‌గారిని, హీరో కంటే తక్కువ వయసున్న పాత్ర కోసం వృతి వాఘానిని తీసుకున్నాం. నాకు కామెడీ కథలంటే ఇష్టం. అయితే కామెడీ రాయడం కష్టం. ఈ సినిమాలో క్లీన్‌ కామెడీ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాలో అందరూ కామెడీ బాగా చేయగలిగినవారే ఉన్నారు. బాగా చేశారు’’ అని అన్నారు.

సుందరకాండ చిత్రం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. నటీనటుల అద్భుతమైన నటనతో చిత్రం విజయం సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.