|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Coolie Movie: కూలీ మూవీ క్రేజ్.. ఒక్కో టికెట్‌ ఏకంగా వేల రూపాయలా?

Published: 12-08-2025, 6:57 AM
Coolie Movie: కూలీ మూవీ క్రేజ్.. ఒక్కో టికెట్‌ ఏకంగా వేల రూపాయలా?

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ డిమాండ్‌తో, కొన్ని చోట్ల టికెట్ల ధరలు వేల రూపాయల్లో పలుకుతున్నాయి.

Key Points

1

రజినీకాంత్ 'కూలీ' సినిమా టికెట్లకు భారీ డిమాండ్

2

చెన్నైలో టికెట్ ధరలు రూ.4500 వరకు పెరిగాయి

4

సినిమా మొదటి రోజే రూ.150 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది

టికెట్లకు అపూర్వ డిమాండ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‌ మోస్ట్ ‌ అవైటేడ్ చిత్రం కూలీ . లోకేశ్ కనగరాజ్ ‌ దర్శకత్వంలో వస్తోన్నఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది . ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా .. కొద్ది నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి . ఇండియాతో పాటు ఓవర్ ‌ సీస్ ‌ లోనూ రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్కైపోతున్నాయి .

ఇక తమిళనాడులో ఏకంగా రికార్డ్ ‌ ధరకు టికెట్స్ ‌ విక్రయిస్తున్నారు . కూలీ మూవీ క్రేజ్ ‌ ను కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారు . చెన్నైలో కూలీ టిక్కెట్స్ ‌ ను బ్లాక్ ‌ లో ఏకంగా రూ .4500 లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది . ఫస్ట్ డే ఫస్ట్ షోలకు విపరీతమైన డిమాండ్ ‌ ఉండడంతో ఎంత రేటుకైనా అభిమానులు ఎగబడి కొనేస్తున్నట్లు టాక్ . పొల్లాచ్చిలో ఓ థియేటర్ సిబ్బంది మొదటి షో టికెట్లను రూ .400 కు అమ్ముతున్నట్లు తెలిసింది .

బ్లాక్ మార్కెట్లో టికెట్ల ధరలు

టికెట్ రేట్లపై రజినీకాంత్ వీరాభిమాని ప్రభాకర్ మాట్లాడుతూ .. “చెన్నైలోని అన్ని ప్రముఖ థియేటర్లలో నేను నా అదృష్టాన్ని పరీక్షించుకున్నా. టికెట్స్ ‌ రూ.600, రూ.1,000ల నుంచి అత్యధికంగా రూ.4,500 వరకు అమ్ముతున్నారు. మొదటి షో కోసం టిక్కెట్ల యాప్‌ల ద్వారా బుక్ చేసుకోలేకపోతున్నా . ఎందుకంటే ఆ టికెట్స్ అన్నీ బ్లాక్ చేశారు . నాలాంటి అభిమానులకు టిక్కెట్లను బ్లాక్‌లో కొనడం కష్టం . మొదటి షోలు ముగిసే వరకు వేచి ఉండటం తప్ప వేరే మార్గం లేదు.” అని ఆవేదన వ్యక్తం చేశారు .

వివిధ రాష్ట్రాల్లో టికెట్ ధరలు

అయితే కేవలం తమిళనాడులోనే కాదు .. ‘కూలీ’ డబ్బింగ్ వర్షన్‌లకు కూడా టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో తమిళంతో పాటు తెలుగులో విడుదలవుతోంది. రెండు రాష్ట్రాలు తెల్లవారుజామున షోలను అనుమతివ్వడంతో టికెట్ ధరలు భారీగానే పెంచేశారు . ఇక బెంగళూరులో సింగిల్ స్క్రీన్లలో దాదాపు ఒక్కో టికెట్ రూ. 2,000 వరకు అమ్ముడవుతున్నాయి. బెంగళూరులో టిక్కెట్ల ధర మల్టీప్లెక్స్ ‌ల్లో ఒక్కో టికెట్ రూ. 500 పైగానే ఉన్నాయి . ముంబయి థియేటర్లలో ‘కూలీ’ టికెట్ ధరలు రూ. 250 నుంచి రూ. 500 మధ్య ఉన్నాయి . అడ్వాన్స్ బుకింక్స్ చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

రజినీకాంత్ అభిమానుల ఉత్సాహం ‘కూలీ’ సినిమాకు భారీ వసూళ్లను తెచ్చిపెడుతుందని అంచనాలు. టికెట్ల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అభిమానులు సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.