|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Coolie Movie Trailer Review: రజనీకాంత్‌, నాగార్జున ఊచకోత.. `కూలీ` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published: 02-08-2025, 10:41 AM

సుపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి నటీనటులు ఈ చిత్రంలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Key Points

1

రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల యాక్షన్ సన్నివేశాలు అద్భుతం.

2

అనిరుధ్ రవిచందర్ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది.

4

ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్.

యాక్షన్‌తో రెచ్చిపోయిన ట్రైలర్

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న మూవీ `కూలీ`. నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఊపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. భారీ యాక్షన్‌ ప్రధానంగా, ఎలివేషన్ల ప్రధానంగా సాగే ట్రైలర్‌ అదిరిపోయింది.

`ఒకడు పుట్టగాడే, వాడి చావు ఎవరి చేతిలో ఉంటదో తలమీద రాసి పెట్టి ఉంటది` అనే నాగార్జున డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఒక మనిషిని ఈ లోకం నుంచి ట్రైసే లేకుండా తుడిచేయగలమంటే ఇది పెద్ద డిజాస్టర్‌` అని మరో వ్యక్తి చెప్పడం, `కేవలం ఈ నెట్ వర్క్ తోనే ఇంత పెద్ద వాళ్లు అయ్యారంటే నేను ఒప్పుకోవడం లేదు సర్‌` అని మరో వ్యక్తి చెప్పగా, అమీర్‌ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఎవరికీ తెలియకుండా వాళ్లు ఇంకేదో చేస్తున్నారు సర్‌ అని చెప్పగా, అమీర్‌ యాక్షన్‌లోకి దిగారు. అనంతరం నాగార్జున యాక్షన్‌లోకి దిగారు.

ఎమోషనల్ సన్నివేశాల ప్రభావం

ఇక్కడ ఉన్న 14 400 మంది నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ అని మలయాళ నటుడు చెప్పగా, మరో విలన్‌ వచ్చి అన్ని గదుల్లో బాంబులు పెట్టండ్రా దెబ్బకి బూడిదైపోవాలి అని చెప్పడం,  దీంతో నవ్వుతూ రజనీకాంత్‌ వాయిస్‌ వినిపించింది.

ఒక పెద్ద గోడౌన్‌లో రజనీకాంత్‌ ఎంట్రీ. మొదట ఎమోషనల్‌గా సాగాయి. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నది అని రజనీకాంత్‌కి సత్య రాజ్‌ వార్నింగ్‌ ఇవ్వడం, ఎవరు తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయిందని, ఆయన మీకు కేవలం ఫ్రెండేసార్‌, కానీ మాకు మా నాన్న అని శృతి హాసన్‌ చెప్పడం ఎమోషనల్‌గా ఉంది. కానీ నవ్వుతూ రజనీ చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయి.

అనిరుధ్ రవిచందర్ సంగీతం

ఆ తర్వాత యాక్షన్‌తో స్టార్ట్ అయ్యారు. వరుసగా నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, చివరికి రజనీకాంత్‌ యాక్షన్‌తో రెచ్చిపోయారు. అదిరిపోయే యాక్షన్‌తో గూస్‌ బంమ్స్ తెప్పించారు. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని రజనీకాంత్‌ని చూపించబోతున్నారు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన యాక్షన్‌ విషయంలో రాజీపడబోనని వెల్లడించారు. ట్రైలర్‌ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. ముఖ్యంగా బీజీఎం ఇరగదీశారు. సినిమా స్థాయిని పెంచేశారు.

సినిమా కథేంటో ఇప్పటికే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ వెల్లడించారు. ఇది స్మగ్లింగ్‌ ప్రధానంగా సాగుతుందని అన్నారు. రకరకాల నేపథ్యాలు వినిపించాయి. కానీ గోల్డ్ వాచ్‌ల స్మగ్లింగ్‌ని, అత్యంత ఖరీదైన చేతిగడియరాల అక్రమ రవాణాని ఇందులో చూపించబోతున్నారు లోకేష్‌ కనగరాజ్‌. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాజాగా ట్రైలర్‌లోనూ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఆ క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న విడుదల కానుంది. భారీ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజు బాలీవుడ్‌ మూవీ `వార్‌ 2` రిలీజ్‌ కానుంది. ఈ రెండు బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నాయని చెప్పొచ్చు.

మొత్తం మీద, `కూలీ` ట్రైలర్ అంచనాలను అందుకుంటూ, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.