|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ ధాటికి విలవిలలాడుతున్న క్యూబా! దేశమంతా చీకటిమయం!!

Published: 22-03-2026, 3:05 AM
ట్రంప్ ధాటికి విలవిలలాడుతున్న క్యూబా! దేశమంతా చీకటిమయం!!
  • ట్రంప్ నిర్ణయాల వల్ల క్యూబాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది.
  • దేశంలో 10 నుంచి 20 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
  • వెనిజులా నుండి చమురు సరఫరా నిలిచిపోవడంతో క్యూబా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
  • ట్రంప్ ఆంక్షల వల్ల ఇతర దేశాలు కూడా క్యూబాకు ఇంధనం సరఫరా చేయడం లేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా క్యూబాలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. దేశమంతటా అంధకారం నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

క్యూబాలో విద్యుత్ సంక్షోభానికి కారణం ట్రంప్ నిర్ణయాలేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక తలలు బాదుకుంటున్నాయి. ఆయన తన సరదాల కోసం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి విపత్తుగా మారుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‍తో కలిసి ఇరాన్‍పై తలపెట్టిన దండయాత్ర ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దెబ్బకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతుండగా ట్రంప్ నిర్ణయం కారణంగా తాజాగా ద్వీప దేశం క్యూబాలో (Cuba విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు కొనసాగుతండగా శనివారం క్యూబా రాజధాని హవానాతో పాటు దేశమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదు రోజుల్లో ఇలా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలడం ఇది రెండోసారి కావడం అక్కడ విద్యుత్ కష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అద్దం పడుతోంది.

అమెరికా విధిస్తున్న చమురు దిగ్బంధం (Oil Blockade) కారణంగా క్యూబా తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ ప్రభుత్వం బంధించింది. అప్పటి నుంచి క్యూబాకు చమురు కష్టాలు ఏర్పడ్డాయి. క్యూబా అవసరాలకు పెద్ద ఎత్తున చమురు వెనిజులా నుంచే దిగుమతి అవుతుడగా మదురో అరెస్టుతో క్యూబాకు ఎటువంటి చమురు దిగుమతులు జరగలేదు. దీనికి తోడు మదురో అరెస్టు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా ప్రభుత్వం వ్యతిరేకించిందని దీంతో క్యూబాకు ఏ ఇతర దేశాలు ఇంధనం సరఫరా చేయవద్దంటూ ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో చమురు దిగుమతులు జరగలేదు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయడం లేదు. విద్యుత్ ఉత్పత్తి లేక కోతలు క్రమంగా విధిస్తున్న క్యూబా ప్రభుత్వం తాజా దేశవ్యాప్తంగా బ్లాకౌట్ లోకి వెళ్లింది. విద్యుత్ సరఫరా లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హారం, మందులు మరియు ఇతర కనీస అవసరాల కొరతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సెల్ ఫోన్లలో చార్జింగ్ లేకపోవడంతో ప్రజల మధ్య కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పర్యాటక రంగంపై ఆధారపడే విమాన సర్వీసులు కూడా రద్దవుతున్నాయి.

చమురు దిగ్బంధంతో క్యూబా ప్రజల కష్టాలు

దేశవ్యాప్తంగా నిలిచిన విద్యుత్ సరఫరా, ప్రజల అవస్థలు

ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.