
ప్రముఖ నటులు మంచు లక్ష్మీ మరియు మోహన్ బాబు తొలిసారి కలిసి నటిస్తున్న ‘దక్ష’ సినిమా ట్రైలర్ విడుదలైంది. అల్లు అర్జున్ ఈ ట్రైలర్‌ను విడుదల చేయగా, సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Key Points
మంచు లక్ష్మీ మరియు మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అల్లు అర్జున్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
‘ది డెడ్లీ కాన్స్పిరసీ’ అనేది ట్యాగ్‌లైన్.
అల్లు అర్జున్ చేత ట్రైలర్ విడుదల
Daksha Trailer : మంచు లక్ష్మీ, మోహన్ బాబు కలిసి మొదటిసారి ఓ సినిమా చేస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై వంశీ కృష్ణ మల్లా నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘దక్ష’. ది డెడ్లీ కాన్స్పిరసీ అనేది ట్యాగ్ లైన్. దక్ష సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.(Daksha Trailer)
దక్ష ట్రైలర్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. నా ఫ్రెండ్ లక్ష్మీ మంచుకి తన రాబోతున్న దక్ష సినిమాకు శుభాకాంక్షలు. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు అల్లు అర్జున్. మీరు కూడా దక్ష ట్రైలర్ చూసేయండి..
మంచు లక్ష్మీ, మోహన్ బాబు కలిసి
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో ట్రైలర్‌ను ప్రదర్శించగా అక్కడ అందరికీ నచ్చింది. మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్రని చేశారు. మోహన్ బాబుగారిని, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అని తెలిపారు.
సెప్టెంబర్ 19న సినిమా విడుదల
Also See : Bhumika Chawla : అదే అందం.. అదే కొంటెతనం.. చీరకట్టులో భూమిక లేటెస్ట్ ఫొటోలు..
మొత్తంమీద, మంచు లక్ష్మీ, మోహన్ బాబుల కలయికతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దక్ష’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.


