|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Darshan: విషమివ్వాలని కోరిన దర్శన్.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!

Published: 10-09-2025, 8:17 AM

కన్నడ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్నారు. జైలులోని దారుణ పరిస్థితులను గురించి కోర్టుకు వివరించిన దర్శన్, విషం ఇవ్వమని కోరారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలేమిటో తెలుసుకుందాం.

Key Points

1

కన్నడ నటుడు దర్శన్ జైలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2

కోర్టు దర్శన్‌కు జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.

4

రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్ విచారణకు హాజరయ్యారు.

దర్శన్‌ జైలులో ఇబ్బందులు

కన్నడ హీరో దర్శన్ ‌ ప్ర ‍ స్తుతం జైల్లో ఉన్నారు . రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు . ఈ కేసులో దర్శన్ ‌ తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ ‌ చేసిన సంగతి తెలిసిందే . అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్ ‌ గా హాజరైన దర్శన్ ‌.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు . జైల్లో ఉండలేకపోతున్నానని .. తన పరిస్థితి అ ‍ త్యంత దుర్భరంగా మారిందని అన్నారు . దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు .

కోర్టు కీలక ఆదేశాలు

అయితే దర్శన్ ‌ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది . అదే సమయంలో దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది . దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా .. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్ ‌ గా విచారణకు హాజరయ్యారు . దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం , దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బళ్లారి జైలు బదిలీ ప్రతిపాదన తిరస్కరణ

అంతకుముందు దర్శన్ ‌ జడ్జితో మాట్లాడుతూ .. ‘నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది’ అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు’ అని సమాధానమిచ్చారు.

దర్శన్‌కు జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించడంతోపాటు, బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. రేణుకాస్వామి హత్య కేసు విచారణ కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.