
సినీ చరిత్రలో కమల్ హాసన్ ‘దశావతారం’ సినిమాలోని సునామీ దృశ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ నిజ జీవితంలో సునామీ విధ్వంసం అంతకు మించి ఉంటుందా? ఈ షాకింగ్ వాస్తవాలు, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి!
Key Points
దశావతారం సునామీకి, 2004 నాటి విపత్తుకు ఉన్న తేడాలు, పోలికలు!
సునామీ అలల వేగం గంటకు 800 కిమీ వరకు – ఊహించని విధ్వంసం!
సముద్రం వెనక్కి వెళ్లడం సునామీకి తొలి సంకేతం: అప్రమత్తంగా ఉండండి!
15 మీటర్ల ఎత్తైన అలలు, 30 మీటర్ల ఎత్తుకు చేరిన నీరు – భయంకర దృశ్యాలు!
దశావతారం vs నిజ జీవిత సునామీ: షాకింగ్ వాస్తవాలు!
ప్రపంచంలోనే 2004లో సంభవించిన సునామీ అత్యంత భయంకర విపత్తుల్లో ఒకటి. ఇండోనేషియా సుమత్రా దీవుల్లో భూకంపం వల్ల భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఏర్పడింది. దీనితో సముద్ర గర్భంలో ఏర్పడిన డిస్ట్రబెన్స్ వల్ల సునామీ సంభవించింది. ఆ సునామీ ప్రభావం ఇండోనేషియా, థాయిలాండ్, ఇండియా, శీలంక లాంటి దేశాలపై పడింది. ఇండియాలో సునామి ధాటికి 12వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అన్ని దేశాలలో కలిపితే మొత్తం ప్రాణ నష్టం 2 లక్షలకు పైగా జరిగింది.
కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రంలో క్లైమాక్స్ లో సునామీ సన్నివేశాలని భయంకరంగా చూపించారు. నిజంగా సునామీ సృష్టించే విధ్వంసం అంత భయంకరంగా ఉంటుందా ? అలలు అంత భారీగా ఎగసిపడతాయా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సునామీ ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది దాని తీవ్రతని బట్టి ఉంటుంది. దశావతారంలో భారీ అలలు దూసుకొస్తునట్లు చూపించారు. నిజానికి అన్ని ప్రాంతాల్లో అలలు అంతే భారీగా ఉండవు.
సునామీ సంకేతాలు: ప్రాణాలను కాపాడే కీలక సమాచారం!
2004లో సునామి వచ్చినప్పడు అలలు 3 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు అలలు ఎగసి పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి అలలు మారాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం 15 మీటర్ల వరకు అలలు ఎగసి పడ్డాయి. అలల ఎత్తు మాత్రమే కాదు వాటి వేగం కూడా భయంకరంగా ఉంటుంది. సునామీలో అలల వేగం గంటకు 500 కిమీ నుంచి 800 కిమీ వరకు ఉంటుంది. అంత వేగంతో అలలు వస్తే అవి సృష్టించే విధ్వంసం ఊహకు కూడా అందదు. ఇండోనేషియాలో అయితే కొన్ని ప్రాంతాల్లో అలలు 30 మీటర్ల వరకు కూడా ఎగసిపడ్డాయి.
సునామీ సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమేనా అంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే సాధ్యమే అని చెప్పొచ్చు. సునామీ వచ్చే ముందు ప్రధానంగా కనిపించే సంకేతం సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళుతుంది. సముద్రపు నీళ్లు అసాధారణంగా వెనక్కి వెళతాయి. టెక్టోనిక్ ప్లేట్స్ లో కదలిక వల్ల సముద్రపు నీళ్లు 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వెనక్కి వెళుతూ ఉంటుంది. సునామీ వస్తుంది అని చెప్పడానికి ఇది బలమైన సంకేతం. ఆ సమయంలో సముద్ర తీర ప్రాంతానికి దూరంగా వెళ్లడం ఉత్తమం.
భయంకరమైన అలలు: వేగం, ఎత్తు ఎంత?
కుదిరితే 30 మీటర్ల ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ప్రతి సునామీలో సముద్రం వెనక్కి వెళుతుంది అని చెప్పలేం. ఎలాంటి సంకేతం లేకుండా రాకాసి అలలు ఎగసి పడవచ్చు. 2004లో సునామీ వచ్చినప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళింది. కానీ ఆ సమయంలో సునామీ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు. దీనితో బీచ్ లోనే ఉన్న వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఎత్తైన భవనాల వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు.
సునామీ భయంకరమైన విపత్తు. ‘దశావతారం’ సినిమాలోని దృశ్యాలు కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అప్రమత్తంగా ఉండి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం వేచి ఉండండి!
